Homeఆంధ్రప్రదేశ్‌Nara Bhuvaneshwari: 2 శాతానికే అన్నికోట్లా.. ఆస్తి గుట్టువిప్పి చిక్కుల్లో పడ్డ నారా భువనేశ్వరి..!

Nara Bhuvaneshwari: 2 శాతానికే అన్నికోట్లా.. ఆస్తి గుట్టువిప్పి చిక్కుల్లో పడ్డ నారా భువనేశ్వరి..!

Nara Bhuvaneshwari: స్కిల్‌ కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయకుదు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన భార నారా భువనేశ్వరి ఎన్నడూ స్పందించలేదు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో భువనేశ్వరి ఏనాడూ వేదికలపైగానీ, ప్రజల సభలో కానీ మాట్లాడింది లేదు. కానీ తాజాగా భర్త జైలుకు వెళ్లడంతో ఆమె గడప దాటారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరుగుతున్నారు. పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. తన భర్త గురించి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె తన భర్త అవినీతి పరుడు కాదని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్ట్‌ చేసి జైల్లో వేశారని ఆరోపించారు. ప్రజల సొమ్ము తమకు వద్దన్నారు. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని భువనేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో తన ఆస్తి గుట్టు విప్పారు.

2 శాతం అమ్మితేనే రూ.400 కోట్లు..
హెరిటేజ్‌లోని తన వాటాలో కేవలం రెండు శాతాన్ని అమ్మితే క్షణంలో రూ.400 కోట్లు వస్తాయని అలాంటి తమకు ప్రజలసొమ్ము ఎందుకని ప్రశ్నించారు భువనేశ్వరి. అధికారికలెక్కలు చూస్తే.. హెరిటేజ్‌లో భువనేశ్వరికి 39.6 శాతం వాటా ఉంది. అంటే కాస్త అటూ ఇటుగా 40 శాతం అన్నమాట. ఈ లెక్కన భువనేశ్వరి పూర్తి వాటా విక్రయిస్తే ఆమె సంపాదన సుమారుగా రూ.15 వేల కోట్లు ఉంటుంది.

వైసీపీకి అస్త్రంగా..
ఇక భువనేశ్వరి ఆమె తెలిసి మాట్లాడారో, ప్రజల డబ్బు తమకు అవసరం లేదని చెప్పడానికి మాట్లాడారో కానీ మొత్తానికి ఆమె తన ఆస్తుల లెక్క బయటికి చెప్పేశారు. ఇదిప్పుడు టీడీపీకి అనవసరమైన తలనొప్పిని తెచ్చేలా ఉంది. భువనేశ్వరి ప్రకటన వైసీపీకి అస్త్రంగా మారింది. రెండు శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు వస్తున్నప్పుడు మొత్తం వాటా విలువ ఎన్ని వేలకోట్లు ఉంటుంది ? ఇదంతా ఎలా సంపాదించారు ? ఇది అక్రమార్జన కాదా అంటూ సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

భువనేశ్వరికి ఎమ్మెల్సీ కౌంటర్‌..
నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్ల రూపాయాలు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారు.. ఈ లెక్కన మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లు.. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి రూ.20 వేల కోట్లకు మీ ఆస్తులు ఎలా పెరిగాయి? అంటూ నిలదీశారు. ఒకప్పుడు చంద్రబాబు ఆస్తి ఎంత? ఇప్పుడు ఆస్తి ఎంత? పాలమ్మితేనే రూ.20 వేల కోట్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు.
Recommended Video:
చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో పొత్తు తర్వాత జరిగే మొదటి వారాహి యాత్రపై ఆంధ్రా అంతా ఎదురుచూపు|Ok Telugu

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version