https://oktelugu.com/

Prakash Raj: ఆ స్టార్ హీరోకు సారీ చెప్పిన ప్రకాష్ రాజ్.. అసలేం జరిగిందంటే?

సిద్దార్థ హీరోగా నటించిన చిత్తా సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ బెంగుళూరు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 29, 2023 / 12:42 PM IST

    Prakash Raj

    Follow us on

    Prakash Raj: హీరో సిద్దార్థకు చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులో తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా నిరసనకారులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం ఉంది. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వడం పై బెంగుళూరులో బంద్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల మధ్య వేడి వాతావరణం చోటు చేసుకుంది.

    సిద్దార్థ హీరోగా నటించిన చిత్తా సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ బెంగుళూరు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం మొదలైన కాసేపటికి నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. హీరో సిద్ధార్థను అడ్డుకున్నారు. ఒక తమిళ నటుడు కర్ణాటకలో తన సినిమాను ప్రమోట్ చేయడానికి వీల్లేదన్నారు. కావేరి జలాల వివాదం నడుస్తుండగా తమిళ సినిమాలు ఆడనీయం అన్నారు.

    హఠాత్పరిణామం తో కంగుతిన్న సిద్ధార్థ అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. రాజకీయ వివాదంలోకి ఓ నటుడిని లాగడాన్ని ఆయన తప్పుబట్టారు. సిద్ధార్థను అడ్డుకోవడం సరికాదన్నారు.

    దశాబ్దాలుగా సమస్యను చక్కబెట్టని పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకులను, జోక్యం చేసుకోని కేంద్రాన్ని, పార్లమెంటేరియన్స్ ని ప్రశ్నించకుండా ఒక నటుడిని ప్రశ్నించడం ఏమిటీ? కన్నడిగులు తరపున హీరో సిద్ధార్థకు క్షమాపణలు చెబుతున్నాను… అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…