ప్రకాశం జిల్లా దగదర్తికి చెందిన గద్దె రామయ్యకు బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని ఓ మహిళకు పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవించే రామయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జలదంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ప్రేమగా నమ్మించాడు. దీంతో బాలికను ఆకర్షించాడు. ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగించాడు. దీంతో పెళ్లయినా బాలికతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. కొడుకులు లేరనే సాకుతో ఆమెతో పెళ్లికి రెడీ అయిపోయాడు.
ఈ నేపథ్యంలో అతడి కపట నాటకాన్ని తెలుసుకున్న రెండు కుటుంబాలు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇద్దరిని ఎవరి ఇళ్లకు వారిని తీసుకెళ్లారు. దీంతో బాలిక ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలంలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. కానీ అతడు నిత్యం బాలికతో ఫోన్ లో మాట్లాడేవాడు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించారు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదనుగా ఇంటి నుంచి బయటకు వచ్చి కలుసుకోవాలని తాము తండ్రీ కూతుళ్లమని చెప్పి ముంబై రహదారి పక్కనున్న లాడ్జీలో ఓ గది అద్దెకు తీసుకున్నారు.
బుధవారం తెల్లవారు జామున ఇద్దరు విషం తీసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో లాడ్జీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికే అందరు వద్దని వారించినా వారిలో మార్పు కనిపించలేదు. వయసు తేడా ఉన్నా వారు అమర ప్రేమికులుగా భావించుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ వయసులో ఆయనకు పుట్టిన చెడు బుద్ధికి అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.