30 Cities : జలమే జీవనాధారం. మనిషి తిండి లేకున్నా కొద్ది రోజులు ఉండే వీలున్నా నీరు లేకపోతే బతకలేడు. అలాంటి నీరు మనిషికి అత్యవసరం. సురక్షిత నీరు అందక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యం మెరుగుపరచాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి కార్యరూపలం దాల్చడం లేదు. ఫలితంగా తాగునీరు సైతం అందకుండా చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తోంది. దేశంలోని 30 నగరాలు తాగునీటి ముప్పును ఎదుర్కోనున్నాయని తెలుస్తోంది.

దేశంలోని మురుగు కాలనీల్లో 44 శాతం మంది ప్రజలు తాగడానికి తంటాలు పడుతున్నారు. భవిష్యత్ లో మరిన్ని నగరాలు ఈ సమస్యను అధిగమించేందుకు రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలసిస్ యూనిట్ నివేదిక ప్రకారం 2012-2018 మధ్య కాలంలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపయిందని తేల్చింది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు గ్రేవ్ వాటర్ రిస్క్ ను ఎదుర్కోనున్నట్లు సమాచారం. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో భూగర్భజలాలు తగ్గిపోవడం వంటి కారణాలతో తాగునీటి ఇబ్బందులు రానున్నాయి. సుమారు పది కోట్ల మంది ప్రజలు తాగునీటి కోసం అల్లాడతారని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది.
పట్టణాల్లోని ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు ఎన్ని పథకాలు తెచ్చినా నీటి సరఫరా మెరుగు కావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టినా కూడా అవి విజయవంతం కావడం లేదు. ఈ క్రమంలో తాగునీటి కోసం ప్రజల అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికి కూడా వాటర్ బాటిళ్లపైనే ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతోంది.
Also Read: Somu Veerraju: రైతుల పాదయాత్రకు సోము వీర్రాజు రె‘ఢీ’.. బీజేపీ పోరుబాట
ప్రభుత్వాలు ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు మరిన్ని పథకాలు తీసుకొచ్చి వాటిని సమర్థంగా పని చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పటిష్టంగా పనులు చేసేలా చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమష్టిగా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: KCR vs BJP: బీజేపీని కొట్టేయాలి.. కేసీఆర్ కేబినెట్ విస్తరణ వెనుక భారీ ప్లాన్?