కార్పొరేట్ కక్కుర్తికి బాలింత బలి.. కరోనా చికిత్సకు 29లక్షల బిల్లు

తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రులు కాసుల కక్కుర్తితో ప్రజలను ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే రోగుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. కరోనా విషయంలో వైద్యులు మానవత్వంతో మెలగాలని ప్రభుత్వాలు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. కరోనాకు ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. ప్రాణాల కాపాడుకునేందుకు రోగులు పడుతున్న గోసను ఆసరాగా చేసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు లక్షల్లో దండుకుంటున్నాయి. కరోనా నిబంధనలు పాటించని ప్రైవేట్ […]

Written By: NARESH, Updated On : September 4, 2020 11:51 am
Follow us on


తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రులు కాసుల కక్కుర్తితో ప్రజలను ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే రోగుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. కరోనా విషయంలో వైద్యులు మానవత్వంతో మెలగాలని ప్రభుత్వాలు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. కరోనాకు ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. ప్రాణాల కాపాడుకునేందుకు రోగులు పడుతున్న గోసను ఆసరాగా చేసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు లక్షల్లో దండుకుంటున్నాయి.

కరోనా నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణ మాత్రం శూన్యంగా కన్పిస్తోంది. తుతూమంత్రంగా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగించుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాహాకానికి ఓ బాలింత మృతిచెందింది. ఆమె మృతికి సంబంధించిన రిపోర్టులు చూపించకుండానే రూ.29లక్షల బిల్లులు వసూలు చేయడం కార్పొరేట్ ఆస్పత్రుల దోపీడికి నిదర్శకంగా కన్పిస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని బల్సురుగొండకు చెందిన శ్వేతారెడ్డికి ఇటీవల గ్రూపు-2లో ఏసీటీవోగా ఎంపికైంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె ఇటీవల గర్భవతి అయ్యారు. ఈక్రమంలోనే జులై 27న స్వల్పజ్వరం రావడంతో ఆమె భర్త మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చేర్పించారు. అయినా జర్వం తగ్గలేదు. అక్కడి వైద్యులు కరోనా భావించి చికిత్సకు నిరాకరించారు. దీంతో ఆమెను ఆగస్టు 4న డెలివరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. రూ.2లక్షలు చెల్లిస్తేనే సిజేరియన్ చేస్తామని చెప్పి డబ్బలు కట్టించుకొని డెలవరీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమెకు కొద్దిగా ఆయాసం ఉండటంతో అనుమానంతో కరోనా టెస్టులు చేశారు.

అయితే వైద్యులు మాత్రం ఆమె రిపోర్టులు చూపించకుండా 20రోజులు ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో తన భార్యను కాపాడుకునేందుకు మాధవరెడ్డి వారిడినంత డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో రూ.29లక్షలు ఫీజు వసూలు చేశారు. అయితే చివరకు ఆమె మృతదేహాన్ని భర్త అప్పగించడంతో ఆయన ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వాలని నిలదీయగా వారు సేసేమీరా అనడంతో ఆ ఆస్పత్రిపై హైదరాబాద్ డీఎంహెచ్ఓకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.