Maoists Killed: ఉత్తర తెలంగాణ సరిహద్దు రక్తసిక్తమైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి నెత్తురోడింది. భారీ ఎన్ కౌంటర్ లో 26మంది మావోయిస్టుల శవాలు కుప్పలుగా పడిఉన్నాయి. మావోయిస్టుల మరణాల సంఖ్య భారీగా ఉందని.. పోలీసులు కూడా గాయపడినట్టు సమాచారం అందుతోంది.
గడ్చిరోలిలోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఈరోజు ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 26మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడినట్లు ఎస్పీ తెలిపారు.
గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు ఈ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఈ కాల్పులు జరిపినట్టు తెలిసింది. కాల్పుల్లో 26మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
ఇక బాలాఘాట్ జిల్లాలో పోలీస్ ఇన్ ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు కాల్చి చంపారు. సంతోష్, జగదీష్ యాదవ్ లను మావోయిస్టులు కాల్చి చంపినట్టుగా తెలిసింది. ఈ మేరకు మావోయిస్టులు కరపత్రాలను వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఈ కరపత్రాలు వదిలివెళ్లారు.