Hindus in Pakistan: పాకిస్తాన్ లో హిందూ జనాభా క్రమంగా క్షీణిస్తోంది. స్వాతంత్ర్యానంతరం అక్కడే ఉండిపోయిన హిందువులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. మైనార్టీలకు ఎలాంటి హక్కులు ఉండవు. కనీసం గుర్తింపు కూడా ఉండదు. అదే మన దేశంలో అన్ని హక్కులు అనుభవిస్తున్నారు. వారి దేశంలోనైతే హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా 18.68 కోట్లు ఉండగా అందులో హిందువులు 22 లక్షలు మాత్రమే. అంటే 1.8 శాతం అన్నమాట. అదే మన దేశంలో వారి జనాభా దాదాపు 20 శాతంగా ఉండటం గమనార్హం. పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. వారు చెప్పిందే శాసనం. వారు గీసిందే రాజ్యాంగం అనే తరహాలో అక్కడ మైనార్టీల బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వమే నేతాజీ ముస్లింలను వారి దేశానికి పంపాలని చెప్పినా మహాత్మాగాంధీ మాత్రం వినకుండా వారు ఇక్కడే ఉండేలా చేశారు. దీంతో మనమేమో వారికి బ్రహ్మహారతులు ఇస్తుంటే వారేమో మనల్ని నీచంగా చూడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి. దేశ విబజనకు పూర్వమే ఈ తంతు కొనసాగాల్సి ఉన్నా మన పాలకుల విధానాలతో ముందుకు సాగలేదు. ఫలితంగా ఇప్పుడు మనం దాని తాలూకు బాధలను అనుభవిస్తున్నాం.
Also Read: Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి ఎలా మరణించాడు? అసలేంటి కథ?
పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీల జనాభా ఐదు శాతం కంటే తక్కువే అని సర్వేలు చెబుతున్నాయి. కానీ వారికి అందాల్సిన ఫలాలు కూడా లేవు. దీంతో వారు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. దొరికితే తినాలి. లేదంటే పస్తులుండాలి. ఇదే అక్కడి రాజ్యాంగం. పాలకుల తీరు. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. అక్కడి మైనార్టీలపై దాడులు కూడా అధికమే. పాకిస్తాన్ లో వారు మనుగడ వర్ణనాతీతం. కానీ ఇక్కడకు రాలేక అక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
చట్టసభల్లో పోటీ చేసే అర్హత ఉండదు. ఉద్యోగాలు చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మొత్తం మైనార్టీలది బానిస బతుకులు. ముస్లింల చెరలో బందీలు. వారి ఆగడాలకు అంతే ఉండదు. ఎప్పుడైనా మన మతం జెండా ఎగరేస్తే అంతే. వారంతా వచ్చి ఇల్లును గుల్లచేసి వెళతారు. అంతటి దారుణమైన పరిస్థితి. ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలున్నా పాక్ పన్నాగాలను ఆపడం లేదు. అక్కడ మైనార్టీల దయనీయ పరిస్థితికి ఏ సంస్థ కూడా జాలి చూపడం లేదు. ఫలితంగా వారు జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారని చెప్పవచ్చు.
Also Read:YCP MLAs Graph: గ్రాఫ్ పెంచుకునేదెలా? అధినేత అల్టిమేటంపై వైసీపీ నేతల మల్లగుల్లాలు