https://oktelugu.com/

Legal Marriage Age For Women: పెద్దఎత్తున ఆడపిల్లలకు పెళ్లిళ్లు.. గడువుకంటే ముందే కానిచ్చేస్తున్నారు!

21-year-old marriage law amendment: ఆడపిల్లంటే గుండెలపై భారం అని భావించే తల్లిదండ్రులు ఇంకా మన సమాజంలో ఉన్నారు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఇక తమ భారం దిగిపోయిందని సంబరపడే వారు ఎందరో.. కానీ ఆడపిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలన్న సృహ కొన్ని వర్గాల్లో ఇప్పటికీ లేదు. అందుకే ఈడుకు రాగానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం కనీస వివాహ వయసును పెంచుతుందన్న నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు అలెర్ట్ అయ్యారు. ఒక అమ్మాయి వివాహ వయస్సు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2022 / 09:50 AM IST
    Follow us on

    21-year-old marriage law amendment: ఆడపిల్లంటే గుండెలపై భారం అని భావించే తల్లిదండ్రులు ఇంకా మన సమాజంలో ఉన్నారు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఇక తమ భారం దిగిపోయిందని సంబరపడే వారు ఎందరో.. కానీ ఆడపిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలన్న సృహ కొన్ని వర్గాల్లో ఇప్పటికీ లేదు. అందుకే ఈడుకు రాగానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం కనీస వివాహ వయసును పెంచుతుందన్న నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు అలెర్ట్ అయ్యారు. ఒక అమ్మాయి వివాహ వయస్సు 18 ఏళ్ల నుంచి 21కి పెంచడం కరెక్టెనా..? ఈ పెంపుతో ఎవరికి లాభం..? ఒక అమ్మాయి తరుపున దీనిని సమ్మతిస్తున్నా..కుటుంబాల వైపు నుంచి చూస్తే ఈ చట్ట సవరణ నష్టమే అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాహ చట్ట సవరణ బిల్లును సెలక్షన్ కమిటీకి అప్పగింగింది. ఇదిలా ఉండగా ఈ చట్ట సవరణ విషయం తెలియగానే కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు తెగ తొందరపడుతున్నారు. ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు ఎక్కడా ఆగిపోతాయోనని ఆందోళనతో వెంటనే చేసేస్తున్నారు.

    kanyadaan1

    భారతదేశంలో యువతుల వివాహ వయస్సు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే దీనిపై అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారా..? అంటే లేరనే చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో వివాహ వయస్సు పెంపుతో నష్టమేనంటున్నారు. కానీ ఒక అమ్మాయి మనస్తత్వం ప్రకారం ఆలోచిస్తే వివాహ వయస్సు పెంచాల్సిందేనని మేధావులు అంటున్నారు. ఇన్నాళ్లు 18 ఏళ్లకే వివాహ వయస్సు ఉండడంతో ఆ వయసు రాగానే తొందరపడి తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేశారని, దీంతో చాలా మంది అమ్మాయిలు లోకం తెలిసే సమయంలోపే అత్తారింట్లో ఉంటున్నారని అన్నారు.

    Also Read: రేవంత్ రెడ్డి కథ క్లైమాక్స్ కు వచ్చిందా? తెరవెనుక ఏం జరుగుతోంది?

    తాజాగా వివాహ వయస్సు పెంపుతో అమ్మాయికి స్వేచ్ఛ దొరకడమే కాకుండా, తన జీవితాన్ని నిర్ణయించుకునే శక్తి వస్తుందని అంటున్నారు. అయితే కొన్ని వైపుల నుంచి సానుకూల పవనాలు లేకపోవడంతో ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. సెలక్ట్ కమిటి ఇచ్చిన నివేదిక ద్వారానే వివాహ బిల్లు చట్టాన్ని సవరణ చేయనున్నారు.అయితే కేంద్ర ప్రభుత్వం వివాహ వయస్సు పెంపు బిల్లు గురించి తీసుకురాగానే కొంత మంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేయడానికి తొందరపడుతున్నారు.

    ముఖ్యంగా హైదరాబాద్లోని ముస్లిం కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కొత్త చట్టం గురించి తెలియగానే ఒక్కరోజులోనే పెళ్లిళ్లు నిశ్చయమవుతున్నాయి. అంతే కాకుండా మిగతా విషయాలపై ఎక్కువగా అభ్యంతరం చెప్పకుండా కొత్త చట్టం వచ్చే లోపే పెళ్లిళ్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు నెలల గడవు ఉండగా.. అంతకుముందే శుభకార్యం కానిస్తున్నారు. ఒక వేళ్ల కొత్త చట్టం అమల్లోకి వస్తే తమ కూతుళ్లకు పెళ్లి చేయకుండా మూడేళ్ల వరకు ఆగడం ఇబ్బందేనని హైదరాబాద్ కు చెందిన ఓ ముస్లిం కుటుంబ యజమాని వాపోయాడు.

    ‘ఇప్పటికే కరోనా వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేదు. అమ్మాయి పెళ్లి చేయడానికి అప్పు తీసుకొచ్చాం. కొత్త చట్టం అమల్లోకి వస్తే చేసిన అప్పుకు వడ్డీ బారెడు అవుతుంది. మరోవైపు ఇప్పటికే నిశ్చయమైన సంబంధం అన్ని రోజులు ఆగే ప్రసక్తి ఉండదు. అందువల్ల మా అమ్మాయికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది’ అని ఓ కుటుంబ యజమాని చెప్పాడు.

    అయితే ఇతర దేశాల కంటే భారతదేశంలో పెళ్లిళ్లు భిన్నంగా ఉంటాయి. ఇతర దేశాల్లో పెళ్లికి ముందే అబ్బాయి, అమ్మాయి కలిసి తిరుగుతారు. కానీ ఇక్కడి పెళ్లిళ్లు సంప్రదాయాలతో ముడిపడి ఉంటాయి. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పెళ్లి కోసం మరో మూడేళ్లు ఆగే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇరు కుటుంబాలు నిశ్చయించుకునే కార్యక్రమం. ఈ విషయంలో ఒక్కసారి పెళ్లి ఫిక్సయితే దాదాపు పెళ్లి అయినట్లేనని భావించి వివాహాన్ని వాయిదా వేయడానికి ఇష్టపడరు.

    కాగా ఇలాంటి హడావుడి పెళ్లిళ్లు కేవలం హైదరాబాద్లోనే కనిపిస్తున్నాయి. బెంగుళూరు లాంటి నగరాల్లో ఈ పరిస్థితి ఉండదు. అక్కడ అమ్మాయిలకు కనీసం 20 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహం చేయడానికి ఇష్టపడుతారు. అయితే నిరుపేద కుటుంబాల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండకపోవచ్చు.

    Also Read:  పీఆర్సీ నాన్చడంలో ప్రభుత్వ దురుద్దేశం ఏమిటో?