US war on Iraq ఇరాక్ అమెరికా దాడి చేసి రెండు దశాబ్ధాలు పూర్తయ్యింది. సద్ధాంను హతమార్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధ నేరస్థులుగా ఉండాల్సిన అమెరికా ప్రజాస్వామ్య పరిరక్షురాలిగా రెండు దశాబ్ధాలుగా చెలామణి అయ్యింది.
2003 నుంచి 2011 దాదాపు 8 సంవత్సరాలు అమెరికా సైన్యాలు ఇరాక్ లో తిష్టవేశాయి. ఎటువంటి కారణం లేకుండానే ఇతర దేశాన్ని ఆక్రమించేసి అనుకూల ప్రభుత్వాలతో ఆడించాయి. ఇరాక్ ప్రజలు అమెరికా వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో ఇక అగ్రరాజ్యం పెట్టాబేడా సర్దుకొని ఇరాక్ ను విడిచిపెట్టింది.
అయితే ఇరాక్ లో అమెరికా వ్యవహారశైలి కారణంగా అక్కడ అన్యాయానికి గురైన సున్నీలు ‘ఐఎస్ఐఎస్’ గా వ్యాప్తి చెంది ఒక బలమైన ఉగ్రవాద సంస్థగా ఏర్పడి ప్రపంచానికే పెను సవాల్ విసిరింది. ఐసిస్ ను కట్టడి చేయడంలో విఫలమైన ఇరాక్ ప్రభుత్వం మళ్లీ అమెరికాను శరణు వేడింది. 2014లో తిరిగి ఇరాక్ లో అమెరికా సైన్యం ప్రవేశించింది. 2017 వరకూ అమెరికా మిత్రదేశాల సైన్యాలు యుద్ధం చేసి ఐసిస్ ను అంతమొందించింది.
20 ఏళ్లు గడిచిన ఇరాక్ ఇప్పుడు ఎలా ఉంది? ఒకనాడు అమెరికా, నేడు ఇరాన్ వలన అస్తిత్వం ప్రమాదంలో పడిన ఇరాక్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.