https://oktelugu.com/

TRS: టీఆర్‌ఎస్‌ 20 ఏండ్ల ప్రస్థానం.. జలదృశ్యం నుంచి జనాల గుండె చప్పుడు దాకా..

TRS:  సబ్బండ వర్ణాల జెండా అది.. అందరినీ ఏకం చేసి స్వరాష్ట్ర సాధనకు పోరు సల్పిన కాగడా అది.. స్వాప్నించిన తెలంగాణలో అభివృద్ధికి పరుగులు పెట్టిస్తున్న మంత్రమది. అదే అదే గులాబీ జెండా.. అప్పుడే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సమితి ఏర్పాటై 20 ఏండ్లవుతోంది. ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో మొక్కవోని దీక్షలు, ఎన్నో స్వప్నాలు, మరెన్నో త్యాగాలు.. వెరసి అదే జెండా నీడన అభివృద్ధికై పరుగులు తీస్తున్న ప్రభుత్వం.. అప్పుడూ ఇప్పుడూ రథసారధి సారే.. కేసీఆరే.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 25, 2021 / 03:21 PM IST
    Follow us on

    TRS:  సబ్బండ వర్ణాల జెండా అది.. అందరినీ ఏకం చేసి స్వరాష్ట్ర సాధనకు పోరు సల్పిన కాగడా అది.. స్వాప్నించిన తెలంగాణలో అభివృద్ధికి పరుగులు పెట్టిస్తున్న మంత్రమది. అదే అదే గులాబీ జెండా.. అప్పుడే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సమితి ఏర్పాటై 20 ఏండ్లవుతోంది. ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో మొక్కవోని దీక్షలు, ఎన్నో స్వప్నాలు, మరెన్నో త్యాగాలు.. వెరసి అదే జెండా నీడన అభివృద్ధికై పరుగులు తీస్తున్న ప్రభుత్వం.. అప్పుడూ ఇప్పుడూ రథసారధి సారే.. కేసీఆరే..
    తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల స్వప్నం స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. స్వయం పాలన , నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్‌ 27 నాడు జలద శ్యంలో కేసీఆర్‌ ప్రారంభించారు. అప్పుడు ఆయన వెంట గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇవాళ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించే పార్టీగా మారింది. మొక్కవోని పట్టుదలతో మొక్క నుంచి వ క్షంలా టీఆర్‌ఎస్‌ను పెంచారయన. పార్టీ ప్రారంభం నుంచే ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఓ దశలో టీఆర్‌ఎస్‌ పనైపోయిందని అనుకున్నారు. కానీ వైఎస్‌ మరణం తర్వాత అప్పటి వరకూ తొక్కి పెట్టిన తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. దాన్ని కేసీఆర్‌ అందిపుచ్చుకున్నారు. 2009లో కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహార దీక్షే మలి దశ ఉద్యమానికి కీలకం. 2009 నవంబర్‌ 29వ తేదీన తెలంగాణ కోసం కరీంనగర్‌ నుంచి సిద్దిపేట బయలుదేరారు. కరీంనగర్‌ సమీపంలోని అల్గునూర్‌ చౌరస్తా వద్ద పోలీసులు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఖమ్మం తరలించారు. కేసీఆర్‌ దీక్ష భగం చేసి ఖమ్మం సబ్‌ జైలుకు తరలించి రెండురోజులు బంధించారు. జైల్లో కూడా కేసీఆర్‌ నిరహార దీక్ష చేశారు. నిమ్స్‌కు తీసుకొచ్చినా దీక్షను కంటిన్యూ చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటంతో చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు.

    తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్‌ఎస్‌ !
    ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ కేసీఆర్‌ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, సంయమనంతో, పట్టువిడుపులు ప్రదర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కేసీఆర్‌ తెలంగాణలోని పది జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి క షి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ పెరగడంతో నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్‌తో తాము కలవడానికి సిద్ధమని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. దానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి.

    2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక మైలురాయి. గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరింది. ప్రభుత్వంలో భాగమైనా తెలంగాణ ఆకాంక్ష లక్ష్యం వీడలేదు. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌ క షి చేసింది. అయితే తెలంగాణపై కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలిగింది. ఎటూతోచని స్థితిలో ఉన్న టీఆర్‌స్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెస్సార్‌ సవాల్‌ విసరడం.. కేసీఆర్‌ అందిపుచ్చుకుని రాజీనామా చేయడం… కరీంనగర్‌ నుంచి మరోసారి భారీ విజయం సాధించడం టీఆర్‌ఎస్‌లోనూ, తెలంగాణవాదుల్లోనూ జోష్‌ నింపింది. 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్‌ఎస్‌ జతకట్టి మహాకూటమిగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లోనే గెలుపొందింది. గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశా నిస్పృహలు, కేసీఆర్‌పై తిరుగుబాట్లు.. వెరసి అయోమయం పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ వాదం బలహీన పడుతోందని భావించిన ప్రతీసారి రాజీనామాలే అస్త్రంగా ప్రయోగించారు. అయితే కొన్నిసార్లు ఈ వ్యూహం కూడా దెబ్బతిన్నది. టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ప్రస్థానంలో చాలా సార్లు చీలికలకు గురైంది. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితిని ఎదుర్కొంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాలమ తి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు టీఆర్‌ఎస్‌కు కలసివచ్చాయి. కేసీఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలంటూ 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరహార దీక్షకు దిగారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది కీలకమలుపు. కేసీఆర్‌ దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధ తం అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2009 డిసెంబర్‌ 9న అప్పటి హౌంమంత్రి చిదంబరం.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్‌ 23న యూపీఎ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధ తమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది. ఈ దశలో టీఆర్‌ఎస్‌ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని నడిపించింది. మిలియన్‌ మార్చ్‌, వంటా వార్పు, సాగరహారం తదితర ఉద్యమాల్లో ముందుండి నడిచింది. ఉద్యమ వేడీ ఎక్కడా తగ్గకుండా చూశారు. దీంతో ఎట్టకేలకు యూపీఎ తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌సభలో 2014 ఫిబ్రవరి 18న రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది. రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 అపాయింటెడ్‌ డే గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన 2001 ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా టీఆర్‌ఎస్‌ చరిత్రేననేది ఇప్పుడు గులాబీ శ్రేణులు గర్వంగా చెప్పే మాట.

    అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకత్వానికి భరోసా ఇస్తూ తెలంగాణ స్నప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్‌ అదిష్టించి.. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఉప ఎన్నికలే కాదు.. ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇక ముందు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర తెలంగాణ అనే మాట వినిపిస్తే ముందుకు గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ మాత్రమే. కేసీఆర్‌ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్‌ అన్నంతగా స్వరాష్ట్ర ఉద్యమాన్ని శ్వాసించిన ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ వెనక్కి తగ్గకుండా వెరవకుండా పోరాడి అంది వచ్చిన అవకాశాల్ని ఉద్యమసోపానాలుగా మార్చుకుని కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టి తెలంగాణ ప్రజానీకాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలపై యుద్ధం ప్రారంభించారు. రాజకీయాలపై కేసీఆర్‌కు స్పష్టమైన రూట్‌ మ్యాప్‌ ఉందని అనుకోవచ్చు. కేసీఆర్‌ టైమింగ్‌ అనితర సాధ్యం. ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఫెయిలైన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఈ రెండు దశాబ్దాలు తెలంగాణ కోసం ఆయన రాజకీయం అనుకుంటే.. ఇక నుంచి దేశం కోసం ఆయన రాజకీయం చేయబోతున్నారని అనుకోవచ్చు.

    మరోసారి అధ్యక్షుడిగా కేసీఆర్‌
    టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు కె.కేశవరావు ప్రకటించారు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు క తజ్ఞతలు తెలిపారు. 2001లో జలద శ్యంలో గులాబీ జెండా పుట్టిందన్న కేసీఆర్‌.. కొద్దిమంది మిత్రులతో ఉద్యమ ప్రస్థానం మొదలైందన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇంట్లో, అనేక అనుమానాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వస్తే ఏ రంగం కుంటుపడుతుందందని చెప్పారో.. అందులోనే ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు కేసీఆర్‌. తెలంగాణ వస్తే భూములు ధరలు పడిపోతాయి, కరెంట కోతలు ఉంటాయి, అభివ ద్ధి కుంటుపడుతుందని కామెంట్‌ చేశారని, కాని దేశంలోనే అభివ ద్ధిలో అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. కరోనా కారణంగా 90 రోజులు లాక్‌డౌన్‌ ఉన్నా.. ఆ కష్టాన్ని అధిగమించి 11.5 శాతం వ ద్ధితో దేశంలోనే టాప్‌ స్టేట్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం అని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను చూసి.. పక్క రాష్ట్రం వాళ్లు సైతం తెలంగాణలో తమ ప్రాంతాన్ని కలపాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నాందెడ్‌ ప్రాంత ఎమ్మెల్యేలు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమ దగ్గరా అమలు చేయాలని డిమాండ్‌ చేశారని, లేదంటే తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారని చెప్పారు. రాయచూర్‌ ఎమ్మెల్యే సైతం మంత్రి సాక్షిగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలు చేయండి లేదా తెలంగాణలో కలపండి అని డిమాండ్‌ చేశారని చెప్పుకొచ్చారు. దళితబంధు ప్రకటించిన తరువాత.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టాలంటూ ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఏపీలో పార్టీని ప్రారంభిస్తే.. గెలిపించుకోడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజ్ఞప్తి చేశారన్నారు సీఎం కేసీఆర్‌. ఏపీలో కరెంట్‌ కోతలపైనా కామెంట్‌ చేశారు సీఎం కేసీఆర్‌. ఏ రాష్ట్రం నుంచి విడిపోయామో ఆ రాష్ట్రానికి ఇప్పుడు కరెంటు లేదు అని కామెంట్‌ చేశారు. తలసరి ఆదాయంలోనూ పక్క రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ అభివ ద్ధి కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే.. ప్రతిపక్షాలు సహకరించకపోగా.. పథకాలను అడ్డుకోడానికి కేసుల మీద కేసులు పెట్టాయన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం.. ఇలా ప్రతి పథకం, అభివ ద్ధి పనులపై కేసులు వేశారని ఆరోపించారు.

    దళిత బంధు వల్ల సంపద స ష్టి జరుగుతుందన్నారు కేసీఆర్‌. తాను అందరిబంధువునని, కేవలం దళితుల కోసమే కాకుండా అందరి కోసం పథకాలు తీసుకొస్తామన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, వివిధ వర్గాల వారి కోసం వివిధ పథకాలు తీసుకొస్తామన్నారు. సభలు పెట్టొద్దని కేసులు పెట్టడంపై ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు కేసీఆర్‌. నాగార్జునసాగర్‌లో సభ పెట్టొద్దన్నారు.. కాని ఫలితం ఎలా వచ్చిందో అందరూ చూశారన్నారు. హుజురాబాద్‌లోనూ సభ పెట్టకుండా రాజకీయం చేశారన్నారు. భారత దేశాన్ని తట్టిలేపిన పథకం దళితబంధు అని, ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్‌ ఆపేది కేవలం నవంబర్‌ 4వ తేదీ వరకేనని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలిచి, దళిత బంధును పూర్తిచేస్తారని అన్నారు.

     

    Tags