ABN RK: ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి.. అన్నట్టుంటుంది ఎల్లో మీడియా వ్యవహార శైలి. జగన్కు వ్యతిరేకంగా ఉన్న వార్త అంటే చాలు పూనకం వచ్చేస్తుంది. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా అధిపతులు చేసే సాహసం అంతా ఇంతా కాదు. ఇండియా టుడే సి ఓటర్ సర్వే పేరుతో ఓ నివేదికను ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయంలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలోనే తేడా కనిపిస్తుండడం నిదర్శనం.
ఇండియా టుడే సి ఓటర్ సంస్థ మూడ్ ఆఫ్ ఇండియా పేరిట ఓ సర్వేను వెల్లడించడం వాస్తవం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. అయితే చాలావరకు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల ఫలితాలను వెల్లడించింది. కానీ ఏపీ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే ఈ నివేదికకు సంబంధించిన చర్చలో ఏపీలో ఎన్డీఏ కి భాగస్వామ్యం కానీ.. త్వరలో అయ్యే ఛాన్స్ ఉన్న పార్టీకి మొగ్గు కనిపిస్తుందని.. చర్చా వేదికలో పాల్గొన్న రాజీవ్ సర్దేపసాయి చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అప్పటినుంచి ఎల్లో మీడియా చేస్తున్న అతి అంతా కాదు.
ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 లో ప్రత్యేక కథనాలు, డిబేట్ లు నడుస్తున్నాయి. టిడిపి ఒంటరిగా పోటీ చేసిన 15 లోక్సభ సీట్లలో గెలుస్తుందని.. వైసిపి కేవలం మూడు నుంచి నాలుగు సీట్లకు పరిమితం అవుతుందని ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్త ఈనాడు పత్రికలో కనిపించకపోవడం గమనార్హం. విశ్వసనీయత లేని వార్త కాబట్టే రామోజీరావు తన పత్రికలో ఈ సర్వేకు స్థానం కల్పించలేదని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ స్థానాలు, వైసీపీకి మూడు స్థానాలు, మరి మిగతా ఏడు ఏమైనట్టు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. బిజెపికి రెండు, జనసేనకు ఒక లోక్సభ స్థానం పొత్తులో భాగంగా టిడిపి ఇస్తుందని చెబుతున్నారని.. మరి ఏడు స్థానాలు ఆ రెండు పార్టీలకు ఎలా కట్టబెట్టారని.. ఆంధ్రజ్యోతి ఆర్కెను ప్రశ్నిస్తూ సెటైరికల్ గా పోస్ట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు.