
భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకి అధిక మొత్తంలోనమోదవుతున్నాయి. వైరస్ సోకితే దాదాపు ప్రాణాలు పోవాల్సిందే తప్పా కోలుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అయింది. అదేమిటంటే.. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా సోకిన వారంతా కోలుకుంటున్నారు. మొత్తం 11 మందికి కరోనా సోకగా వారంతా తిరిగి కోలుకున్నారని అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ప్రకటించారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని సంఘి తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కరోనా సోకిన వారంతా కోలుకోవడానికి అధికారులు తీసుకున్న చర్యలను అంతా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.