
ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు ఏమైందో తెలీదు కానీ అధికారపక్షంపై విమర్శలు చేయకుండా మాత్రం ఆయన ఉండలేకపోతున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. అధికారపక్షంపై విమర్శలు అవసరమే. అయితే ఒక స్థాయి దాటితే ఆ విమర్శలు కూడా వెగటు పుట్టిస్తాయి. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న డిక్లరేషన్ వివాదాన్ని చంద్రబాబు మళ్లీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?
వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ విషయంలో మొదట వివాదా స్పద ప్రకటన చేయడం ఆ ప్రకటన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం తరువాత వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ గురించి వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే సద్దుమణిగిన వివాదం గురించి తాపీగా మరోసారి స్పందిస్తూ చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మరే సమస్య లేని విధంగా డిక్లరేషన్ వివాదం ద్వారా ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు.
చంద్రబాబు లాంటి రాజకీయ నేత చేస్తున్న రాజకీయాలు సామాన్య ప్రజలకు సైతం వెగటు పుట్టిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడని.. అన్య మతస్థుడైన వ్యక్తి టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని.. జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతేడాది జగన్ పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ సమర్పించని విషయం తెలిసిందే.
అయితే చంద్రబాబు మాత్రం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తున్నారు. చిత్తూరు టీడీపీ నేతలకు జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. జగన్ ఒంటరిగా బ్రహ్మోత్సవాల్లో పట్టుబట్టలు సమర్పిస్తే అది రాష్ట్రానికే అరిష్టమని పేర్కొన్నారు. దీంతో వైసీపీ అభిమానులు చంద్రబాబుకు విమర్శలు చేయకపోతే నిద్ర పట్టదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో పొలిటికల్ హీట్