https://oktelugu.com/

హోంమంత్రి నిర్లక్ష్యం ఎవరి కొంప ముంచనుందో?

తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండంపై పలువురు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు తదితరులు ఈ మహ్మమరి బారినపడి మత్యువాత పడుతున్నారు. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’? తాజాగా […]

Written By: , Updated On : June 25, 2020 / 06:18 PM IST
Follow us on


తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండంపై పలువురు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు తదితరులు ఈ మహ్మమరి బారినపడి మత్యువాత పడుతున్నారు. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

తాజాగా హోంమంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ తేలింది. ఇది ఒకరి నుంచి మరొకరి చేరి భద్రతా సిబ్బందిలో మొత్తం ఎనిమిది మందికి పాటిటివ్ వచ్చింది. ఆయన భద్రతా సిబ్బంది పాజిటివ్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారందరికీ ప్రమాదమనే చెప్పక తప్పదు. ఈ తరుణంలో ఆయన ఇంటికే పరిమితమై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా.. దానికి విరుద్ధంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేస్తుండటంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో రోజురోజుకీ కేసులు పెరుగుతుండగా సామాన్యులంతా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. సంపన్నులు, నేతలంతా తమ రోజువారీ కార్యక్రమాల్ని సైతం బంద్ చేసుకొని ఎవరికీ వారు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎవరూ ఇంటికి రావద్దని కోరుతుండటం గమనార్హం.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

హోంమంత్రి నివాసం ఉండే మలక్ పేట నియోజవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఆయన భద్రతా సిబ్బందికి పాజిటివ్ తేలింది. ఇలాంటి సమయంలో ఆయన నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అలీ తీరును ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తున్నారు. హోంమంత్రి ఇప్పటికైనా పనుల హడావుడిని పక్కన పెట్టి ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నారు. లేకపోతే ఆయనతోపాటు చుట్టుపక్కల ఉండేవారికి మహమ్మారి ముప్పు తప్పదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.