సడన్ గా కేసీఆర్ కు‘పీవీ’ఎందుకు గుర్తొచ్చాడు?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సడన్ గా మాజీ ప్రధాని, మేధావి అయిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఎందుకు గుర్తొచ్చారు. కాంగ్రెస్ వదిలేసిన పీవీని కేసీఆర్ ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడు? ఆయన సామాజికవర్గం అనా? లేక తెలంగాణకు చెందిన వ్యక్తి అనా కేసీఆర్ ఇంత ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందా అని ఆరాతీస్తున్నారు. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అవును.. తన క్రేజ్ ను […]

Written By: NARESH, Updated On : June 29, 2020 10:45 am
Follow us on


తెలంగాణ సీఎం కేసీఆర్ కు సడన్ గా మాజీ ప్రధాని, మేధావి అయిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఎందుకు గుర్తొచ్చారు. కాంగ్రెస్ వదిలేసిన పీవీని కేసీఆర్ ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడు? ఆయన సామాజికవర్గం అనా? లేక తెలంగాణకు చెందిన వ్యక్తి అనా కేసీఆర్ ఇంత ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందా అని ఆరాతీస్తున్నారు. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అవును.. తన క్రేజ్ ను పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా డిఫెన్స్ లోకి నెట్టివేయడమే కేసీఆర్ ప్లాన్ వెనుక ఉన్న ఉద్దేశంగా చెబుతున్నారు. ఇంతకీ సీఎం కేసీఆర్ వెనుకున్న ప్లానేంటి?

భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం భారతరత్న.. దీన్ని దేశం కోసం సర్వం ధారపోసిన వ్యక్తులకు  ఇస్తారు. తాజాగా ఈ భారతరత్నను తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని  డిమాండ్ చేస్తున్నారు. పీవీ నరసింహారావు దేశం చరిత్రను మార్చి ఆర్థికపునాదులు వేశాడని.. ఆ అవార్డుకు అర్హుడని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం- రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుందని అన్నారు. ఈ విషయంలో  తాను వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్రమోడిని కలుసుకుంటానని, పివికి భారత్ రత్నను ప్రదానం చేయాలని అభ్యర్థిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

అంతటితో ఊరుకోకుండా జయంతి శతాబ్ది ఉత్సవాలను కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రశంసించారు. జయంతి వేడుకలకు రూ .10 కోట్లు మంజూరు చేశారు. పీవీ అనేక రంగాలలో బహుముఖ వ్యక్తిగా చేసిన గొప్ప సేవలను గుర్తుంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.   హైదరాబాద్‌లోని పివి జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం వారి సొంత నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ కుల్లుకునేలా కేసీఆర్ నిర్వహించి ఔరా అనిపించారు.  అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50 ప్రదేశాలలో వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.  పివి  ఐదు కాంస్య విగ్రహాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరా,  ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేయాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రాజ్యసభ ఎంపీ కేశవ రావు నేతృత్వంలో కేసీఆర్ శతాబ్ది ఉత్సవాల కమిటీ నియమించారు.  రామేశ్వరంలో కట్టినట్టు పీవీ కాంస్య విగ్రహాల ఏర్పాటుకు కేసీఆర్ ఓకే చెప్పారు. హైదరాబాద్ వర్సిటీకి పీవీ పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.

కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వెనుక కులం, ప్రాంతం మనిషి కంటే కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా ఏకాకిని చేయడమే పెద్ద ఎజెండా అని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ తెలుగు యోధుడు పీవీని చరిత్రలో చాలా అవమానించాయి. ఇప్పటికీ ఈయనను పట్టించుకోవడం లేదు. పీవీకి క్రెడిట్ దక్కకుండా కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఈ చర్యతో ఇరుకునపెట్టాడు.

పీవీ శతజయంతి ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ పట్టించుకోని ఈ తెలంగాణ యోధుడిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సోనియా గాంధీ సహించని పీవీ జయంతిని తెలంగాణ పండుగలా కేసీఆర్ నిర్వహించం   ద్వారా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తమ పార్టీకే చెందిన పీవీ జయంతిని చేస్తుందా? చేయకపోతే ఆ పార్టీపై విమర్శలు.. చేస్తే సోనియాతో ఇబ్బందులు.. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నే కాదు.. జాతీయ కాంగ్రెస్ ను కూడా పీవీ అస్త్రంతో కొట్టబోతున్నాడు కేసీఆర్. మోడీ, రాష్ట్రపతి వద్దకూ ఈ ఇష్యూని తీసుకెళితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టొచ్చు.  పీవీ చరిత్ర తవ్వితే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న స్ట్రాటజీతోనే పీవీకి భారతరత్న డిమాండ్ ను కేసీఆర్ తెచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-నరేశ్ ఎన్నం