లాక్‌డౌన్‌ లో విశ్వసనీయత పెంచుకున్న ప్రింట్ మీడియా

లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటున్న రంగాలలో ప్రింట్ మీడియా ఒకటి. ప్రచురణ వ్యయంలో అత్యధికభాగం ప్రకటనల నుండి వస్తుండగా, ఇప్పుడు ప్రకటనలే లేకుండా ప్రచురించడం ఒక సవాల్ కాగా, వాటి పంపిణి మరో పెద్ద సమస్యగా మారింది. వీటన్నింటికి మించి వార్తా సేకరణలో ప్రమాదం నెలకొంది. ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి చాల దిన పత్రికలు పేజీల సంఖ్యను, ప్రతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. ఉద్యోగుల జీతాలతో కోత విధించాయి. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 10:46 am
Follow us on


లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటున్న రంగాలలో ప్రింట్ మీడియా ఒకటి. ప్రచురణ వ్యయంలో అత్యధికభాగం ప్రకటనల నుండి వస్తుండగా, ఇప్పుడు ప్రకటనలే లేకుండా ప్రచురించడం ఒక సవాల్ కాగా, వాటి పంపిణి మరో పెద్ద సమస్యగా మారింది. వీటన్నింటికి మించి వార్తా సేకరణలో ప్రమాదం నెలకొంది.

ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి చాల దిన పత్రికలు పేజీల సంఖ్యను, ప్రతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. ఉద్యోగుల జీతాలతో కోత విధించాయి. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ వార్తలను అందజేయడంలో వాటి విశ్వసనీయత గతంలో కన్నా బాగా పెరిగిన్నట్లు వెల్లడి అవుతున్నది.

ప్రజలంతా ఇండ్లకే పరిమితమై ఉండడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం కేటాయింప గలుగుతున్నారు. అదీ గాక సోషల్ మీడియా లో నకిలీ వార్తలు, పుకార్లు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని విశ్వసింపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో సహితం ఒక వంక రాజకీయ అజెండా, మరో వంక వార్తా కథనాలలో స్పష్టత లేకపోవడం, ఒకే వార్తను పలుసార్లు చూపిస్తూ ఉండడంతో ఎక్కువ సమయంలో టివి ఛానల్స్ కోసం కేటాయింపలేక పోతున్నారు.

దాంతో విశ్వసనీయ సమాచారం కోసం ప్రజలు దిన పత్రికలను ఎక్కువగా చదువుతున్నారు. గతంలో అర్ధగంట సేపు పత్రికలను తిరగేసినవారు ఇప్పుడు ఏకంగా గంట పాటు వాటితో గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు దిన పత్రికలు చదివేవారి సంఖ్య రెట్టింపైనట్లు మార్కెట్‌ పరిశోధన సంస్థ అవాన్స్‌ ఫీల్డ్‌ అండ్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ సర్వేలో తేలింది.

ఈ సంస్థ సర్వే ప్రకారం పాఠకులు ప్రతిరోజు దిన పత్రికలు చదివేందుకు గతంలో కన్నా 22 నిమిషాలు ఎక్కువ కేటాయించి సగటున గంట పాటు చదువుతున్నారు. గతంలో పత్రికలు చదివేందుకు సరాసరిగా 38 నిమిషాలు కేటాయించే వారు. గతంలో పత్రికల పఠనానికి 16 శాతం మంది ఎక్కువ సమయం కేటాయించగా, ప్రస్తుతం 40 శాతం మంది తాము గంటకుపైగా దినపత్రికల్లో మునిగితేలుతున్నామని చెప్పారు.

30 నిమిషాలపాటు చదివే పాఠకుల సంఖ్య ఒకేసారి 42 శాతం నుంచి 72 శాతానికి చేరుకొన్నది. లాక్‌డౌన్‌కు ముందు దినపత్రికలను చదువడంలో 15 నిమిషాలపాటు నిమగ్నమయ్యే పాఠకుల సంఖ్య 3 శాతం ఉండగా, ప్రస్తుతం అది 14 శాతంగా నమోదయింది. స్తుతం ఆ సంఖ్య 40 శాతానికి చేరింది.