లాక్‌డౌన్‌ ను ప్రభుత్వం సమర్థించదు: కేటీఆర్

లాక్‌డౌన్‌ తో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ చర్యను ప్రభుత్వం సమర్ధించదని.. కానీ ప్రస్తుత అసాధారణ పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు అరుదుగా జరుతాయన్నారు. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ చేపట్టిందని తెలిపారు. మార్చి31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రజలంతా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌ […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 12:28 pm
Follow us on

లాక్‌డౌన్‌ తో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ చర్యను ప్రభుత్వం సమర్ధించదని.. కానీ ప్రస్తుత అసాధారణ పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు అరుదుగా జరుతాయన్నారు. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ చేపట్టిందని తెలిపారు.

మార్చి31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రజలంతా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ‘నువ్వు బ్రతకుతూ.. తోటివారికి బ్రతికే అవకాశమివ్వాలని’ ఆయన అన్నారు. స్వీయనియంత్రణ పాటించడమే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.

తెలంగాణలో ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దన్నా. కరోనాపై ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి వెళ్లాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. లాక్‌డౌన్‌ చేసిన జిల్లాలో తెల్లరేషన్ కార్డు దారులకు రూ.1,500 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరిస్తే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.