https://oktelugu.com/

మోహరించిన సైన్యాలు.. భారత్-చైనా మధ్య ఉద్రిక్తత

అది 1962.. చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు చైనా కూడా మనలాగే పేద దేశమే. కానీ మన భారత దేశ ప్రభుత్వం ఆ సమయంలో సరిగ్గా స్పందించలేదన్న అపప్రద ఉంది. యుద్ధ విమానాలు, సైన్యం మోహరింపులో నిర్లక్ష్యం కారణంగా నాడు ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయిందన్న విమర్శలున్నాయి. దీంతో భారత్ ఈ యుద్ధంలో ఓడి పలు కీలక ప్రాంతాలను చైనా కోల్పోయింది. లడక్ ను ఆనుకొని ఉన్న ‘ఆక్సాయ్ చిన్’ ప్రాంతాన్ని చైనాకు కోల్పోవాల్సి వచ్చింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2020 7:02 pm
    Follow us on


    అది 1962.. చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు చైనా కూడా మనలాగే పేద దేశమే. కానీ మన భారత దేశ ప్రభుత్వం ఆ సమయంలో సరిగ్గా స్పందించలేదన్న అపప్రద ఉంది. యుద్ధ విమానాలు, సైన్యం మోహరింపులో నిర్లక్ష్యం కారణంగా నాడు ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయిందన్న విమర్శలున్నాయి. దీంతో భారత్ ఈ యుద్ధంలో ఓడి పలు కీలక ప్రాంతాలను చైనా కోల్పోయింది. లడక్ ను ఆనుకొని ఉన్న ‘ఆక్సాయ్ చిన్’ ప్రాంతాన్ని చైనాకు కోల్పోవాల్సి వచ్చింది. నేపాల్ సరిహద్దుల్లో, టిబెట్ వద్ద కూడా భారత్ కీలక భూభాగాలను కోల్పోయింది.

    ఇప్పుడు చైనాలో అదే ఆక్సాయ్ చిన్ గుండా పాకిస్తాన్ మీదుగా హిందూ మహాసముద్ర మార్గం గుండా ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ నిర్మిస్తోంది. దీని ద్వారా చైనా తన వస్తు సామాగ్రిని హిందూ మహాసముద్రంలోకి నేరుగా పంపి అంతర్జాతీయ నౌక రవాణా మార్గాన్ని నిర్మిస్తోంది. ఆగ్నేయాసియా మొత్తం తిరిగి రావాల్సిన పని లేకుండా భారత్ నుంచి లాక్కున్న ఆక్సాయ్ చిన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా కరాచీ వరకు పెద్ద హైవే కారిడార్ ను చైనా నిర్మిస్తూ అంతర్జాతీయ వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతో చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

    భారత రక్షణకు పెనుముప్పుగా వాటిల్లుతున్న ఈ చైనా నిర్మిస్తున్న కారిడార్ ను భారత్ అడ్డుకుంటోంది. పనులు జరగకుండా అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తెస్తోంది.ప్రతిగా చైనా సరిహద్దుల్లో భారత్ భారీగా ప్రాజెక్టులు, నిర్మాణాలు చేపడుతోంది. దీంతో రగిలిపోతున్న చైనా ఏకంగా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. 1962 తర్వాత భారత్-చైనాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం కనిపిస్తోంది.

    శనివారం చైనా-భారత్ దేశాల మధ్య కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో భారత్ చైనా తన సేనల్ని ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేయనుంది. ఇప్పటికే భారత్ తరుఫున లెఫ్ట్ నెంట్ జనరల్ వైకే జోషి లఢక్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఏం జరగనుందనేది ఆందోళన రేకెత్తిస్తోంది.

    ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంటోంది. కశ్మీర్ పక్కనున్న లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్-చైనా సైన్యాలు భారీగా మోహరించాయి. లఢక్ సమీపంలోని పాంగాంగ్, గాల్వాన్ లోయలో భారత్-చైనా ఆర్మీలు బాహాబాహీ తలపడేలా సీన్ ఉంది.పరిస్థితులు చూస్తే చైనా-భారత్ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తోందని సైనిక వర్గాలు అంటున్నాయి.

    కరోనాతో కుదేలైన ఇరు దేశాలు యుద్ధానికి వెళితే అపారనష్టం ఖాయం. కానీ ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గడిచిన రెండు రోజులుగా భారత సరిహద్దుకు చైనీస్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు యుద్ధ సన్నహాలు చేశాయి. భారత్ కూడా కార్గిల్ యుద్ధంలో గెలుపునకు తోడ్పడ్డ బోఫోర్స్ శతఘల్ని చైనా సరిహద్దులో దింపింది. ఇప్పటికే భారత భూభాగంలోని 50 కిలోమీటర్లను చైనా ఆక్రమించినట్టు తాజా రిపోర్టులో వెల్లడి కావడంతో భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది.

    తాజాగా చరిత్రలో మొదటిసారి భారత్-చైనా రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం సమావేశం కాబోతున్నారు. అన్ని విధాలుగా చైనాను డిఫెన్స్ లో వేసేలా భారత్ ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

    –నరేశ్ ఎన్నం