బీహార్ లో ఆర్జేడీకి ఊహించని ఎదురుదెబ్బ

బీహార్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల చేయడంతో పార్టీలన్నీ సమయత్తమవుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే ఇరుపక్షాలు సీట్లు పంచుకున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఎల్జేపీ 42 స్థానాల్లో పోటీచేస్తోంది. ఎక్కువగా బీజేపీ రెబల్స్ కే టికెట్ ఇచ్చింది. బీజేపీ-జేడీయూ ఒక జతగా.. ఆర్జేడీ-కాంగ్రెస్ మరో జతగా బీహార్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. బీహార్ లో మొత్తం 243 […]

Written By: NARESH, Updated On : October 10, 2020 7:10 pm
Follow us on

బీహార్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల చేయడంతో పార్టీలన్నీ సమయత్తమవుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే ఇరుపక్షాలు సీట్లు పంచుకున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఎల్జేపీ 42 స్థానాల్లో పోటీచేస్తోంది. ఎక్కువగా బీజేపీ రెబల్స్ కే టికెట్ ఇచ్చింది. బీజేపీ-జేడీయూ ఒక జతగా.. ఆర్జేడీ-కాంగ్రెస్ మరో జతగా బీహార్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. బీహార్ లో మొత్తం 243 స్థానాలకు గాను మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష యూపీఏ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక మధ్యలో ఎల్జేపీ,ఎన్సీపీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.బీజేపీ తరుఫున ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం ఖాయమైంది.

Also Read: వర్క్ ఫ్రం హోమ్: ఉద్యోగులకు తీపి కబురు

243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొదటి దశలో అక్టోబర్ 28న ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ నవంబర్ 3న, మూడోదశ నవంబర్ 7న జరుగనున్నాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్ లో 143 సీట్లలో ఆర్జేడీ పోటీచేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుంటే.. మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటీచేస్తున్నాయి.

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆర్జేడీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీకి లాలూ ప్రసాద్ సేవలు అందేలా కనిపించడం లేదు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆర్జేడీ అవతరించింది. నితీష్ తో కలిసి ప్రభుత్వాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేశాడు. కానీ ఆ బంధం విడిపోయి పశుదాణా కేసులో ప్రస్తుతం లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా లాలూకు బెయిల్ వచ్చింది. ఇక బయటకు వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. లాలూ వస్తే ఆర్జేడీ గెలుపునకు దోహదపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ట్రెజరీని మోసం చేసి రూ.3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.

Also Read: బీహార్ ఎన్నికలు: అభ్యర్థుల బయోడేటా తెలిస్తే షాకే

అయితే వీరిందరిలోకి బీహార్ లో అత్యంత ప్రభావం చూపగల నేత లాలూ ప్రసాద్ యాదవ్. కానీ ఆయనకు తగ్గట్లే కోర్టు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ వచ్చింది. కానీ మరో కేసులో అరెస్ట్ చేయడంతో ఆయన ప్రచారానికి దూరమయ్యారు. ఇది బీజేపీ-నితీష్ కుట్ర అని ఆర్డేడీ యువనేత , సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.