ఎల్‌.జి.పోలీమర్స్ విషవాయు ప్రభావంపై ఆందోళన

ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిసర గ్రామాల్లో స్ట్రైరీన్‌ విషవాయువు ప్రభావం అదుపులోకి రాకపోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. బాధిత గ్రామాల్లో గత మంగళవారం ఇద్దరు వాలంటీర్లు, ఒక ఆశ వర్కర్లు స్పృహ తప్పిపడిపోవడం గమనార్హం. గ్రామాల్లోకి వచ్చిన స్థానికులు సహితం అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మరోవైపు బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన దానికి వాస్తవంలో అందిస్తున్న మొత్తానికి భారీ తేడా ఉండటంతో స్థానికులు ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వం మాటతప్పిందని […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 3:01 pm
Follow us on

ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిసర గ్రామాల్లో స్ట్రైరీన్‌ విషవాయువు ప్రభావం అదుపులోకి రాకపోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. బాధిత గ్రామాల్లో గత మంగళవారం ఇద్దరు వాలంటీర్లు, ఒక ఆశ వర్కర్లు స్పృహ తప్పిపడిపోవడం గమనార్హం. గ్రామాల్లోకి వచ్చిన స్థానికులు సహితం అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.

మరోవైపు బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన దానికి వాస్తవంలో అందిస్తున్న మొత్తానికి భారీ తేడా ఉండటంతో స్థానికులు ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వం మాటతప్పిందని మండిపడుతున్నారు. మంత్రుల ముందే వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రమాద ఘటనతో గ్రామం విడిచి వెళ్లిపోయిన తమ బంధువుల ఇళ్లలోనూ, పునరావాస కేంద్రాల్లోనూ తలదాచుకున్న వెంకటాపురం, ఇతర నాలుగు గ్రామాల ప్రజలు ఊళ్లలోకి రావడం మొదలుపెట్టారు. అయితే, వీరు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.

ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదంలో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన బాధితులకు పరిహారం చెల్లింపులో కూడా ప్రభుత్వం మాట తప్పింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఒకరొక్కరికి లక్ష్య రూపాయలు చొప్పున ఇవ్వవలసి ఉండగా, రూ 25 వేలు మాత్రమే పంపిణి చేయడం స్థానికులతో తిరుగుబాటుకు దారితీస్తుంది. కొందరికి పరిహారం ఇవ్వకుండానే డిశ్చార్జ్ చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇలా ఉండగా, మొదటి నుండి కంపెనీ యాజమాన్యాన్ని కాపాడటం కోసం పట్లనే శ్రద్ద చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం పట్ల దృష్టి సారింపకుండా వారికి ప్రయోజనం కలిగించేందుకు ఎంతవరకైనా వెళ్ళడానికి వెనుకాడటం లేదు.

తాజాగా, సుమారు రూ.91 కోట్ల విలువైన స్టైరిన్‌ తరలింపు అందులో భాగమేనని తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీ తిరిగి తెరుచుకోవడానికి ఆరు నెలల వరకు పెట్టె అవకాశం ఉన్నందున అవి వృద్దా అయి కంపెనీకి నష్టం జరుగకుండా కొరియాకు ప్రభుత్వమే దగ్గర ఉంది తరలించినట్లు తెలుస్తున్నది.