హెచ్‌1బీ వీసా భారతీయుల్లో గుబులు

కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై దేశం ఆర్ధికమాంద్యంలోకి నెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున లే ఆఫ్‌లు ప్రకటిస్తారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హెచ్‌-1బి వీసాలు కలిగివున్న విదేశీ సాంకేతిక నిపుణుల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోతే ఇంటి బాట పట్టవలసిందేనా అన్న బెంగ ఏర్పడుతున్నది.ఈ వీసాపై ఉన్నవారిలో అత్యధికులు భారతీయులు కావడంతో ఆందోళన కలిగిస్తున్నది. వీరు ఉద్యోగం లేకుండా 60 రోజులకు మించి అమెరికాలో ఉండడానికి వీలుండదు. ఒకవేళ […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 4:47 pm
Follow us on

కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై దేశం ఆర్ధికమాంద్యంలోకి నెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున లే ఆఫ్‌లు ప్రకటిస్తారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హెచ్‌-1బి వీసాలు కలిగివున్న విదేశీ సాంకేతిక నిపుణుల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోతే ఇంటి బాట పట్టవలసిందేనా అన్న బెంగ ఏర్పడుతున్నది.ఈ వీసాపై ఉన్నవారిలో అత్యధికులు భారతీయులు కావడంతో ఆందోళన కలిగిస్తున్నది. వీరు ఉద్యోగం లేకుండా 60 రోజులకు మించి అమెరికాలో ఉండడానికి వీలుండదు.

ఒకవేళ తాము ఉద్యోగం కోల్పోయిన పక్షంలో అమెరికాలో ఉండేందుకు అనుమతించిన కాలపరిమితిని 60 రోజులనుంచి 180 రోజులకు పెంచాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు హెచ్‌1బీ వీసాదారులు ట్రంప్‌ సర్కారుకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే 20 వేలమంది సంతకాలు చేశారు. ఒక ఫిర్యాదుపై వైట్‌ హౌస్‌నుంచి స్పందన రావాలంటే ఆ పిటిషన్‌పై కనీసం లక్ష సంతకాలు సేకరించాల్సి ఉంటుంది.

దీంతో మరో 80 వేల సంతకాలకోసం హెచ్‌1బీ వీసాదారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూసే భారతీయుల కల ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ సంఖ్య 2030 నాటికి రెట్టింపు అవుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దీనివల్ల భారతీయులైతే గ్రీన్‌ కార్డు కోసం దశాబ్దాలపాటు ఎదురుచూడక తప్పదని పేర్కొంది.

మార్చి 21తో ముగిసిన వారానికి రికార్డు స్థాయిలో 33లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం పోయిందని దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రెండు వారాల్లో కరోనా సంక్షోభం మరింత ముదిరే అవకాశం వుండగానే ఇప్పుడే లక్షలాదిమంది నిరుద్యోగులయ్యారు. దాదాపు 47 లక్షల మందికి నిరుద్యోగులుగా మారే అవకాశం వుందని భావిస్తున్నారు.

హెచ్‌-1బి వీసాలు కలిగివున్నవారు నిరుద్యోగ భృతికి, సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు కారు. ఇప్పటికే కొంతమంది హెచ్‌-1బి ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొంతమందికి త్వరలో తీసివేసే అవకాశాలు వున్నాయని ఇప్పటికే యాజమాన్యాలు తెలియచేశాయి.