PPF Scheme: ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీతో పాటు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ ఉండగా ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
రోజుకు కేవలం 417 రూపాయలను పొదుపు చేస్తే ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు కాగా ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ వస్తోంది. 15 సంవత్సరాల తర్వాత అవసరమైతే 5 సంవత్సరాల చొప్పున ఈ స్కీమ్ గడువును పొందే అవకాశం ఉంటుంది. నెలకు 12,500 రూపాయలు ఆదా చేసేవాళ్లు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.
15 సంవత్సరాల పాటు ఈ విధంగా 22.50 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 18.18 లక్షల రూపాయలు వడ్డీగా లభిస్తుంది. మొత్తం 40.68 లక్షల రూపాయలు ఈ విధంగా పొందవచ్చు. 15 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్ స్కీమ్ లో పదేళ్ల పాటు సంవత్సరానికి లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి 37.50 లక్షల రూపాయలు అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత 65.58 లక్షల రూపాయలు వడ్డీగా లబిస్తాయి.
మన దేశంలో నివశించే వాళ్లు ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. స్వయం ఉపాధి పొందేవాళ్లు, పెన్షనర్లకు ఈ స్కీమ్ ప్రయొజనకరంగా ఉంటుంది. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఫారమ్ ఇ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సహాయంతో ఈ స్కీమ్ లో చేరవచ్చు
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: If you save rs 417 per day you own rs 1 crore do you know how is that
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com