TDP Mahanadu 2022: తెలుగు వారి అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వందో జయంతి సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహానాడు సక్సెస్ టీడీపీ క్యాడర్లో కొత్త జోష్ నింపింది. రెండు రోజుల సభలో చంద్రబాబే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడు పదులు దాటిన వయసులోనూ ఆకట్టుకునేలా చేసిన ప్రసంగం, పదునైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, అవినీతిని ఎండగట్టడం, కేడర్‌కు భరోసా ఇచ్చేలా మాట్లాడడం సరికొత్తగా అనిపించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకు పోతే భవిష్యత్ ఉండదన్న భావనలో ఉన్న చంద్రబాబు.. టీడీపీ క్యాడర్లో జోష్ నింపడంతో విజయవంతమయ్యారు. అయితే ఈ జోష్ ఎన్నికల నాటికి కొనసాగంచాలి. ప్రజలను టీడీపీ వైపు మళ్లించాలి. మధ్యంతర ఎన్నికలు రాకపోతే.. రెండేళ్లలో వైఎస్సార్ సీపీ చేపట్టే ఎత్తుగడలను చిత్తుచేయగలగాలి. యువతను ప్రోత్సహించాలి. ఇవన్నీ సాధ్యమేనా అంటే అనుమానమే..
చంద్రబాబు స్పీచ్‌లో పెరిగిన స్పీడ్..
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఏ మాత్రం చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంలో మొత్తంగా బరిలోకి దిగారు. మహానాడుతో దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు. రెండు రోజుల సభలో ప్రారంభోపన్యాసంతో కేడర్‌లో జోష్ నింపిన చంద్రబాబు.. రెండో రోజూ తన స్పీచ్‌లో మరింత స్పీడ్ పెంచారు. ముగింపు ప్రసంగంలో పదునైన వ్యాఖ్యలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ గురించి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కేడర్‌లో సరికొత్త ఉత్సాహం కనిపించింది.
Also Read: RajyaSabha Elections 2022 : దేశంలో అత్యంత ధనవంతుడు.. మన తెలంగాణ ఎంపీ
దాదాపు రెండు గంటలపాటు సాగిన మహానాడు ముగింపు ప్రసంగం ఆసాంతం సరికొత్తగా సాగింది. 75 ఏళ్ల వయసు దాటిన చంద్రబాబు ప్రారంభ, ముగింపు ఉపన్యాసంలో వేదికపై అటూ ఇటూ కదులుతూ.. క్యాడర్ దృస్టి తనపైనే ఉండేలా చూసుకున్నారు. దాదాపు రెండు గంటలు బాబు నలబడే మాట్లాడారు. ప్రభుత్వ పెట్టే కేసులకు భయపడొద్దని, జగన్ అవినీతిని కక్కిస్తానంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీపై తన విజన్ వివరిస్తున్న సమయంలో… తాను ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని, జగన్ దోచుకున్న సొమ్ము రూ.1.17 లక్షల కోట్లు అని చేసిన ఆరోపణతో కేడర్ చేసిన కేకలు, చప్పట్లతో సభాప్రాంగణం మార్మోగింది. ఎన్నికల కోసం జగన్ చేసిన కుయుక్తులను చంద్రబాబు మహానాడు వేదికగా సోదాహరణంగా వివరించారు.
ఓటర్లు టీడీపీ వైపు మళ్లుతారా?
మహానాడు విజయవంతంతో కొత్త ఉత్సాహంలో ఉన్న టీడీపీ ఇప్పుడు చేయాల్సిన పని ప్రజలను తమవైపు మళ్లించుకోవం. సభ సక్సెస అయిందని చల్లగా కూర్చుంటే జగన్ స్పీడ్ ముందు చతకిల పడక తప్పదు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని చెప్పిన బాబు, క్యాడర్‌ను కాపాడుకోవడంపై దృష్టిపెట్టాలి. ఎందుకంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామంటున్న బాబు జనసేన, బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కూటమిలో టీడీపీకి వచ్చే సీట్లు ఎన్ని… అందులో యువతకు వచ్చేవి ఎన్ని అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకవైపు యువతకు 40 శాతం సట్లు అంటున్న బాబు.. మరోవైపు త్యాగాలకు సిద్ధం అని ప్రకటించడం యువ నేతల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ సవాళ్ల మధ్య టికెట్లు రానివారిని నచ్చజెప్పగలగాలి. లీడర్‌షిప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ప్రస్తుం వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో టీడీపీని బలహీనపర్చే చర్యలకు అధికార పార్టీ దిగుతుంది. వీటిని దీటుగా బాబు ఎదుర్కొగలగాలి. వీటితోపాటు ప్రజలను, ఎన్నికల సమయంలో ఓటర్లను తమవైపు తిప్పుకోగలగాలి.
అన్నీ బాబే.. ఇలా అయితే కష్టమే..
టీడీపీలో ప్రస్తుతం అన్నీ చంద్రబాబు చూసుకుంటున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారిపై ఉన్న ఆరోపణలు, ప్రజాకర్షన లీడర్లు లేకపోవడం టీడీపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ వయసులో చంద్రబాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీ కూడా బాబును దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కుప్పంలోనే చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీలో చురుకైన నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బాబు లేకుంటే పార్టీలేదన్న స్థాయి నుంచి టీడీపీలో ప్రతీ కార్యకర్త నాయకుడే అన్న స్థాయికి తీసుకెళ్లగలగాలి. లేని పక్షంలో బాబును దెబ్బకొట్టడంలో అధికార వైసీపీ విజయం సాధిస్తే.. క్యాడర్ విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది.
Also Read:KA Paul- Bandi Sanjay: బండి సంజయ్ కు ఎసరు పెడుతున్న కేఏ పాల్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Huge response to tdp mahanada will people vote for tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com