Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించారట. తన ఫస్ట్ క్రష్ ఆమెనే అని .. తను స్క్రీన్ పై కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. ఇంతకీ చరణ్ మనసు దోచేసిన ఆ బ్యూటీ ఎవరో .. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ మూవీతో ఒక్కసారిగా హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించారు రామ్ చరణ్. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గత ఏడాది యూఎస్ లో సందడి చేశారు.
యూఎస్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో తన ఫస్ట్ క్రష్ ఎవరో తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్లలో మీ క్రష్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దాంతో హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టం అని చరణ్ అన్నారు. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే… కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోతానని చరణ్ అన్నారు. ‘ప్రెట్టి ఉమన్’ సినిమా చూసాక ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని వెల్లడించారు. అలాగే తనకు మరో క్రష్ కూడా ఉందని చెప్పాడు రామ్ చరణ్. కేథరీన్ జెట జోన్స్ అంటే కూడా చాలా ఇష్టం అని తెలిపారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అంజలి మరో హీరోయిన్ గా చేస్తుంది.
ఇక రామ్ చరణ్ తన 16వ చిత్రం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఈ చిత్రం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.