Dasari Arun Kumar
Dasari Arun Kumar: ఈ మధ్య ఇండస్ట్రీలో సెలబ్రిటీల మీద కేసులు నమోదు కావడం చాలా పెరిగిపోతోంది. ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెరగడం అందరినీ కలవర పాటుకు గురి చేస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరువక ముందే.. ఇప్పుడు మరో హీరోను ర్యాష్ డ్రైవింగ్ కేసు కింద అరెస్టు చేయడం ఇండస్ట్రీలో కలవరం రేపుతోంది. సదరు హీరోను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దాసరి అరుణ్ మీద ఈ రోజు ర్యాడ్ డ్రైవింగ్ కింద కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఆయన తెల్లవారు జామున ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేశారని సమాచారం.
Also Read: ప్చ్.. ఆ దర్శక దిగ్గజం పరువు తీస్తున్నారు !
అయితే బంజారాహిల్స్ పరిధిలోని సయ్యద్ నగర్లో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసి రెండు బైకులను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆయన తెల్లవారు జామున ఇలా సయ్యద్ నగర్ గల్లీలలో వేగంగా కారును నడపటం వల్ల ఇలా జరిగినట్టు సమాచారం. ఇక ఆయన డ్రంకెన్ డ్రైవ్ చేసి ఇలా కారును వేగంగా నడిపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికి అయితే ఆయన డ్రంకెన్ డ్రైవ్ చేసినట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు పోలీసులు.
ప్రస్తుతం అరుణ్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మరి కొద్ది సేపట్లో ఆయనకు బ్రీత్ అనలైసిస్ టెస్టు చేయనున్నారు. ఈ టెస్టులో గనక ఆయన డ్రింక్ చేసినట్టు తేలితే మాత్రం కఠిన శిక్ష పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ అలా కాకపోయినా కూడా ర్యాష్ డ్రైవింగ్ మీద కేసు బలంగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా ఇలా సెలబ్రిటీల మీద వరుస కేసులు నమోదు కావడం మాత్రం అందరినీ షాక్కు గురి చేస్తోంది. మరి అరుణ్ కేసు ఏమవుతుందో చూడాలి.
Also Read: ప్చ్.. ‘హీరో’కి 4 కోట్లు నష్టాలు తప్పేలా లేవు !
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Hero dasari arun arrested for hitiing two bikes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com