https://oktelugu.com/

Gomatha: ఈ పని చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారట.. ఏం చేయాలంటే?

Gomatha: మనలో చాలామంది ఎంత శ్రమించినా కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు రావు. సరస్వతీ మాత అనుగ్రహం లేకపోవడం, పవిత్ర కార్యాలను, శుభకార్యాలను చేయలేకపోవడం, తినడానికి ఆహారం లభించకపోవడం, వైభవం డబ్బు లేకపోవడం, చేసే ఏ పనిలో సక్సెస్ సాధించకపోవడం, సంతానం లేకపోవడం, ధైర్యం లేకపోవడాన్ని అష్ట దరిద్రాలని చెబుతారు. అష్ట ఐశ్వర్యాలు ఏ విధంగా ఉంటాయో అష్ట దరిద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి. లింగాష్టకం, దారిద్ర దహన స్తోత్రం జపించడం వల్ల అష్ట దరిద్రాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 3, 2022 / 09:29 AM IST
    Follow us on

    Gomatha: మనలో చాలామంది ఎంత శ్రమించినా కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు రావు. సరస్వతీ మాత అనుగ్రహం లేకపోవడం, పవిత్ర కార్యాలను, శుభకార్యాలను చేయలేకపోవడం, తినడానికి ఆహారం లభించకపోవడం, వైభవం డబ్బు లేకపోవడం, చేసే ఏ పనిలో సక్సెస్ సాధించకపోవడం, సంతానం లేకపోవడం, ధైర్యం లేకపోవడాన్ని అష్ట దరిద్రాలని చెబుతారు. అష్ట ఐశ్వర్యాలు ఏ విధంగా ఉంటాయో అష్ట దరిద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి.

    లింగాష్టకం, దారిద్ర దహన స్తోత్రం జపించడం వల్ల అష్ట దరిద్రాలు దూరమవుతాయి. బాల త్రిపుర సుందరి అమ్మవారికి శివార్చన చేయడం ద్వారా అష్ట దరిద్రాలను తొలగించుకోవచ్చు. అయితే గోమాత తోక కూడా అష్ట దరిద్రాలను సులభంగా దూరం చేస్తుందని చెప్పవచ్చు. మన పురాణాల ప్రకారం గోమాతలో మాత్రమే అందరు దేవతలు ఉన్నారు. గోమాతను పూజించడం ద్వారా ఎన్నో సమస్యలు దూరమవుతాయి.

    గోమాతకు ఆహార పదార్థాలను తినిపించడం ద్వారా కూడా మేలు జరుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే గోమాత తోకను పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్లు గోమాత తోకను తాకుతూ పూజిస్తే మంచిదని చెప్పవచ్చు. గోమాత తోకలో ఉండే వెంట్రుకను తీసుకొని కాలిబొటని వేలుకు కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

    దారం కట్టిన కాలి బొటనువేలిని శరీరంలో నొప్పి ఉన్నచోట ఉంచితే సమస్య తగ్గుతుందని చెప్పవచ్చు. గోవు తోకలోని వెంట్రుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్ట దరిద్రాలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గోమాత తోక వెంట్రుకలను మొలతాడుకు కట్టుకోవడం లేదా తాయత్తులో వాడటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. గోమాతను ప్రార్థించడం ద్వారా గోవు పాలు తాగడం ద్వారా సులభంగా ఆర్థిక సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.