Health Tips: మనలో చాలామందికి ఆహారం తిన్న తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తుంది. అయితే ఎక్కువగా స్వీట్లు తింటే డయాబెటిస్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హోటళ్లలో, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత సోంపు అందిస్తారనే సంగతి తెలిసిందే. అయితే సోంపు ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. సోంపులో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఉంటాయి.
మనలో చాలామంది కంటిచూపు మందగించడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. సోంపు, నవోతు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యంతో పాటు దృష్టి కూడా మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి. క్రమం తప్పకుండా ఎవరైతే ఈ మిశ్రమాన్ని తీసుకుంటారో వాళ్లకు కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మనలో చాలామంది నోటి దుర్వాసన వల్ల బాధ పడుతుంటారు.
Also Read: ఇంట్లో దోమల కాయిల్స్ ను వెలిగించే వాళ్లకు షాకింగ్ న్యూస్!
సోంపు, నవోతు వల్ల నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా చేయడంలో సోంపు సహాయపడుతుంది. సాధారణంగా చల్లని వాతావరణం వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. సోంపుతో పాటు నవోతు తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నవోతులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉంటాయి.
సోంపు, నవోతు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి. సోంపు, నవోతు కలిపి తీసుకుంటే చర్మం పేలవంగా మారడం, తల తిరగడం, నీరసం సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సోంపు సహాయపడుతుంది. సోంపు తిన్న తర్వాత నవోతు తింటే మంచిది.
Also Read: రెడ్ రైస్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. బానపొట్ట సైతం కరిగేలా?