Worms in the stomach of children: చిన్న పిల్లల కడుపులో పురుగులు ఉంటాయని చాలామందికి తెలియదు. ఈ పురుగులనే నులి పురుగులు, సూది పురుగులు అని కూడా అంటుంటారు. ఇవి చిన్న పిల్లల కడుపులో ఉండటం వలన బరువు తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు పిల్లలు. అసలు ఈ పురుగులు రావడానికి కారణాలేంటి ? వీటి నుంచి పిల్లలను ఎలా బయట పడేయాలో వివరంగా తెలుసుకోండి.
ముందు, పిల్లల కడుపులోకి పురుగులు ఎలా వస్తాయి అంటే..
అసలు చిన్న పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి ముఖ్య కారణం నీరు, ఆహారం మాత్రమే. కలుషితమైన నీరు తీసుకోవడం వలన, అలాగే సరిగ్గా ఉడకని ఆహారాన్ని పిల్లలకు తినిపించినందుకు, అదే విధంగా ఆరు బయటే మల విసర్జన, కాళ్ళు, చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకుండా పిల్లలను వదిలేయడం, ఇక పిల్లలందరూ ఒకే చోట ఉండటం వలన కూడా ఒకరి నుంచి మరొకరికి బాక్టీరియా సులువుగా వ్యాపించడం జరుగుతుంది. అలా పురుగులు వస్తాయి.
Also Read: మందు బాబులకు అలెర్ట్.. రోజూ మద్యం తాగితే ఎంత డేంజరో తెలుసా..?
మీ పిల్లలు ఈ పురుగులు నుంచి దూరంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చేయండి.
వెల్లుల్లి మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. అందుకే ప్రతి రోజూ చిన్న గ్లాస్ చొప్పున ముడి వెల్లుల్లి రసంలో కాస్త నీరు కలిపి తాగించండి. వెల్లుల్లి రసం వల్ల ఎలాంటి పురుగులైనా సరే చనిపోతాయి. అలాగే లవంగాల నీరు కూడా బాగా పని చేస్తోంది. రెండు లవంగాలు ఒక గ్లాసు నీటిలో వేసి, ఆ నీటిని తాగించినా మంచి ఫలితాన్ని మీరు చూడొచ్చు. బొప్పాయి జ్యూస్ – ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ లో ఒక స్పూన్ తేనే కలిపి ఇచ్చినా ఆ పురుగులు నశిస్తాయి. పాలు, పసుపు – ప్రతి రోజూ రెండు పూటలా ఒక గ్లాస్ పాలులో ఒక స్పూన్ పసుపు కలిపి పాలు తాగించినా మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు.
Also Read: జీవితంలో క్యాన్సర్, గుండె జబ్బులు రాకూడదు అంటే.. ఇది తినండి !