Top 10 Livable Cities జీవితం చాలా చిన్నది.. దానిని పూర్తిగా అనుభవించేది కొందరు మాత్రమే.. ఉన్నంతకాలం సంతోషంగా గడపాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక. సంతోషమంటే మనుషుల మధ్యే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా బాగుండాలి. అంటే మనం ఉంటున్న ఇల్లు, పట్టణం, నగరం ఏదైనా ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ప్రపంచంలో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడి జీవనగమనం ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాలు కొన్ని ఉన్నాయి. వాటి జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ తాజాగా బయటపెట్టింది. కొన్ని నగరాల్లో జీవితం అత్యంత సుఖమయంగా ఉంటుందని తెలిపింది. ఆ జాబితా గురించి పరిశీలిస్తే..
ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. ఆస్ట్రియా దేశంలోనే ఇది అతిపెద్ద నగరం. ఇక్కడ 1,757 మిలియన్ జనాభా నివసిస్తోంది. 414.65 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం సముద్ర మట్టానికి 151 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 20 శతాబ్దం వరకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జర్మన్ మాట్లాడే నగరం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆస్ట్రోహంగేరియన్ సామ్రాజ్యం విడిపోయేంత వరకు 2 మిలియన్ జనాభా కలిగి ఉంది. యూరోపియన్ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన 7వ పెద్ద దేశం ఆస్ట్రియా.
వియన్నా తరువాత నివాసయోగ్యమైన నగరాలు వరుసగా.. డెన్మార్క్ దేశానికి చెందిన కోపెన్ హెగెన్..కెనడాకు చెందిన కేలగ్రే, వాంకోవర్, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జెనావా, జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్ట్, కెనడాకు చెందిన టోరంటో, నెదర్లాండ్స్ కు చెందిన అమెస్టర్ డామ్, జపాన్ కు చెందిన ఒకాసా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్ బోర్న్ లు వరుసగా టాప్ 10లో ఉన్నాయి. ఇందులో కెనడా దేశానికి చెందిన మూడు నగరాలు ఉండడం విశేషం. ఉత్తర అమెరికాలోని అతిపెద్ద దేశం కెనడా. అటు ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండో అతిపెద్ద దేశం. ఈ దేశంలోని అతిపెద్ద నగరమైన టోరంటో కూడా నివాసయోగ్యమైన నగరాల్లో చోటు సంపాదించుకుంది. అయితే 2006 జనగణన ప్రకారం ఇక్కడి జనాభా 31 కోట్ల 24 లక్షలు. ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన కెనడాలో ఏకంగా మూడు నగరాలు నివాసయోగ్యమైన జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఆయా నగరాల్లో మంచి విద్య, వైద్య సౌకర్యంతోపాటు నివానంగా ఉండడానికి సౌకర్యాలు కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే ఈ నగరాల్లో వినోదం, స్థిరత్వం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక తయారు చేశామని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అయితే ప్రముఖ దేశాలైన ఫ్రాన్స్ రాజధాని పారిస్ 19, యూకే రాజధాని లండన్ 33వ స్థానాల్లో నిలిచాయి. భారత్ లోని ఏ ఒక్క నగరం కూడా టాప్ 10లో లేకపోవడం గమనార్హం. అధిక జనాభా, మౌళిక వసతుల లేమియే భారత్ నగరాలు ఈ జాబితాలో లేకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.