World Asthma Day 2023: ఆస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆస్తమా వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. ఆస్తమా ఉన్న వారు మంచి ఆహారం తీసుకుంటే కష్టాలు రావు. తిండి కోసం వారు కేర్ తీసుకోవాలి. తిండి తీసుకోవడంలో ఆస్తమా ఉన్న వారు అప్రమత్తంగా ఉంటేనే మేలు కలుగుతుంది. ఆస్తమాను తగ్గించుకునేందుకు తీసుకునే ఆహారాలేంటో చూద్దాం. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఇందులో బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరాలు ఉంటాయి. వీటితో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ తో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇంకా కూరగాయలు కూడా మంచి బలాన్ని ఇస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి. అందుకే వీటిని తినడం మేలు.
టమాటాలు
మన కూరల్లో టమాటాలను ఎక్కువగా వాడుకుంటే మంచిది. వీటిలో ఉండే లైకోపీన్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో వీటిని ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస సమస్యలు ఏర్పడితే ఇబ్బందులు వస్తాయి. దీంతో టమాటాలు తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. దీనికి ఆస్తమా పేషెంట్లు రెడీగా ఉండాలి.
చేపలు
ఆస్తమా రోగులకు చేపలు చాలా ముఖ్యమైనవి. చేపల్లో ఒమేగా ఫ్యాట్ 3 ఉండటంతో ఆస్తమా ఉన్న వారికి మంచి ఆహారంగా ఉంటుంది. వర్షాకాలంలో ఆస్తమా పేషెంట్లకు చేప మందు ఇస్తారు. జూన్ 1న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఆస్తమా రోగులు చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. సాల్మన్, హెరింగ్, ట్యూనా, సార్డినెస్ వంటి వల్ల ఆస్తమా పేషెంట్లకు మంచిది.
విటమిన్ డి ఫుడ్స్
విటమిన్ డి ఫుడ్స్ తీసుకుంటే ఆస్తమా పేషెంట్లకు సురక్షితం. వీటి వల్ల ఎంతో మేలు కలుగుతుంది. చేపలు, గుడ్లు, పాలు, నారింజ వంటి వాటి వల్ల ఆస్తమాకు పరిష్కారం దొరుకుతుంది. దీంతో వీటిని తీసుకోవడానికి ముందుకు రావాలి. ఆస్తమా దూరం చేసుకునేందుకు ఇలాంటి వాటిని తీసుకుని రోగాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.