Facebook : ఫేస్ బుక్ తో బంధాలు, సంసారాలు కూలిపోతున్నాయా..? అసలు నిజాలేంటి?

Facebook : శృంగారం.. ఈ పదం అనడానికే ఒకప్పుడు చాలా భయపడేవారు. ఇక ఇందులో ఉన్న సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపానికి గురయ్యేవారు. ఇలాంటి సమస్యలు, అపోహాలను, భయాలను తొలగించేందుకు డాక్టర్ సమరం బహిరంగంగా ఉచిత సలహాలు ఇచ్చేవారు. ఒకప్పుడు ప్రముఖ మ్యాగ్జిన్ స్వాతి బుక్ ను సమరం కోసం కొనేవాళ్లంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇచ్చే సలహాల కోసం ఎంతో మంది ఎదురుచూసేవాళ్లు. తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పుకోలేని సమస్యలు డాక్టర్ సమరం కు చెప్పుకునేవాళ్లు. ప్రతి […]

Written By: NARESH, Updated On : November 17, 2021 12:58 pm
Follow us on

Facebook : శృంగారం.. ఈ పదం అనడానికే ఒకప్పుడు చాలా భయపడేవారు. ఇక ఇందులో ఉన్న సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపానికి గురయ్యేవారు. ఇలాంటి సమస్యలు, అపోహాలను, భయాలను తొలగించేందుకు డాక్టర్ సమరం బహిరంగంగా ఉచిత సలహాలు ఇచ్చేవారు. ఒకప్పుడు ప్రముఖ మ్యాగ్జిన్ స్వాతి బుక్ ను సమరం కోసం కొనేవాళ్లంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇచ్చే సలహాల కోసం ఎంతో మంది ఎదురుచూసేవాళ్లు. తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పుకోలేని సమస్యలు డాక్టర్ సమరం కు చెప్పుకునేవాళ్లు. ప్రతి ఒక్కరు తమ శృంగార సమస్యలను ప్రశ్నల రూపంలో సమరంను అడిగేవారు. వాటికి సమరం ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చేవారు. ఆయన ప్రత్యేకంగా ఆర్టికల్ రాసినా.. ఈ ప్రశ్న, జవాబులకు రీడర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

facebook

టెక్నాలజీ మారుతున్న కొద్దీ సమరం కూడా అప్ గ్రేడ్ అయ్యారు. దీంతో ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది ఆయనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అడుగుతున్నారు. వారి సందేహాలను సమరం తీర్చుతున్నారు. అయితే శృంగారంతో ముడిపడి ఉన్న కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటి ప్రశ్నలకూ సమరం చికాకు పడడం లేదు. ఎంతో ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు. ఇంతకు సమరంను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు..? వాటికి ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారో..? ఇప్పుడు చూద్దాం..

‘సమరం సార్ కు నమస్తే.. ఇటీవల ఫేస్బుక్ ఎక్కువగా వాడితో మగవారిలో నీరసం వస్తుందని, ఆడవాళ్లకు అనారోగ్యం చుట్టుకుంటాయని అంటున్నారు. అంతేకాకుండా విపరీతంగా ఫేస్బుక్ వాడితే మగవాళ్లో శక్తి పూర్తిగా నశిస్తుందని అంటున్నారు..? దీనికి మీ సమాధానం ఏంటి..? అని ప్రశ్నించగా.. ‘మనిషికి అలసట నిద్రలేనప్పుడు వస్తుంది. అది సినిమాలు చూడడం వల్ల కావచ్చు.. లేక ఇతరులతో కబుర్లు చెప్పుకోవడం వల్ల కావచ్చు. కానీ ఫేస్బుక్ చూడడం వల్ల నీరసం రాదు. ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకండి..’ అంటూ సమరం సమాధానం ఇచ్చారు.

‘ఒకరోజు రాత్రి నేను ఫేస్బుక్ లాగిన్ అవుదామని ఎంతో ట్రై చేశాను. మూడు సార్లు పాస్ వర్డ్ కొట్టగా మూడుసార్లు ఎర్రర్ అని వచ్చింది. నేని ఇక ఫేస్బుక్ వాడడానికి పనికిరానంటారా..? అని అడిగారు. దీనికి ‘పాస్ వర్డ్ ఎర్రర్ అని వస్తే మీ మనసును చూసుకోకండి.. మీ ఫోన్ కీ ప్యాడ్ చూడండి.. అక్కడ క్యాప్స్ లాక్ ఆన్ లో ఉండి ఉంటుంది.అందుకే పాస్ వర్డ్ ఎర్రర్ అని వస్తుంది..’ అని సమాధానం ఇచ్చారు.

‘డాక్టర్ గారూ.. ఫేస్బుక్ చాటింగ్ ముందు కాస్త మద్యం సేవిస్తే చాటింగ్ చాలా హుషారుగా ఉంటుందని మా స్నేహితుడు అంటున్నాడు. నిజంగా అలాగే ఉంటుందా..? ఈ ప్రశ్నకు సమరం సమాధానం ఇస్తూ ‘మద్యం సేవించి చాటింగ్ చేస్తే అవాకులు చెవాకులు మొదలవుతాయి. ఆ తరువాత చాటింగ్ గాడి తప్పుతుంది. అందువల్ల మద్యం సేవించి చాటింగ్ చేయకపోవడమే ఉత్తమం’

‘ఫేస్బుక్ తోని సంసారాలు కూలిపోతున్నాయి..దీనికి పరిష్కారం ఉందా డాక్టర్ గారూ..’ ‘సంసారాలు కుప్పకూలేది ఫేస్బుక్ వల్ల కాదు. మనుషుల మధ్య సహజత్వ కోల్పోవడం వల్ల. ఫేస్బుక్ లేనప్పుడు కూడా కొన్ని సంసారాలు కూలిపోయాయి. వాటినేమంటారు. కొందరు ఫేస్బుక్ మాత్రమే వాడరు. వేరే సోషల్ మీడియాను ఫాలో అవుతారు. అలా వాడిన వారు ఎంతమంది కలిసుంటున్నారు..?’

‘ఫేస్బుక్ లో ఎంతసేపు ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది..? ‘ఫేస్బుక్ అనేది అడిషనల్ వినోదాన్ని మాత్రమే పంచుతుంది. దానివల్ల డబ్బులేమీరావు. మీకు డబ్బు సంపాదించే పని ఉన్నప్పుడు ఫేస్బుక్ ను పక్కనబెట్టండి. అలాగే ఇంట్లో వాళ్లకు మీతో అవసరమున్నప్పుడు దానిని పట్టించుకోకండి. ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఫేస్బుక్ జోలికి వెళ్లండి’ అంటూ సమరం చెప్పిన కొన్ని ఆసక్తికర జవాబులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమరం శృంగార సమాధానాలే కాదు.. ఫేస్ బుక్ తో వచ్చే అనర్థాలను అపోహలను కూడా చాలా చక్కగా విడమరిచి చెప్పాడు.