Tamannaah: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పడవలాంటి ప్రయాణం.. పడవ తేలుతున్న అంతసేపు అవకాశాలు దండిగా వస్తాయి. పడవ మునిగి పోతే వాళ్ల ఆచూకీ కూడా ఉండదు. ఇది కేవలం హీరోయిన్స్ కి కాదు కొంతమంది హీరోలకూ కూడా వర్తిస్తుంది అని చెప్పుకోవాలి.అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచనల్లో హీరోయిన్స్ ఉంటారు. అది టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ అయినా సరే తమ మార్కెట్ ఉన్నంతవరకు తన పారితోషకాన్ని పెంచుకుంటారు.

అయితే టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాని పారితోషికం గురించి అడిగితే ‘‘పారితోషికం అనేది నటీనటుల స్థాయిని బట్టి, మార్కెట్‌ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ పారితోషికానికే పనిచేయాల్సి వస్తుంది ఇంకొన్ని సార్లు మాత్రం డిమాండ్ చేసే అవకాశం వస్తుంది. శ్రమకు తగిన పారితోషికం తీసుకునే విషయంలో నాకెలాంటి మొహమాటాలూ ఉండదు. పారితోషికం తగ్గించుకుంటే, వాళ్ళ మార్కెట్ అక్కడితో అయిపోయినట్లే.. ఇక్కడ ఎవరూ ఎవరికీ ఉచితంగా ఏది చేయరు. వారి వారి డిమాండ్ ని బట్టే సప్లయ్ ఉంటుంది’’ . అంటూ ఆర్థిక సూత్రాల్ని చెప్పుకొచ్చింది తమన్నా.
ఈ మిల్క్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నట్లు సమాచారం. తమన్నా నటించిన” f3″ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది..