Jasmine: హిళలు తలలో పూలు పెట్టుకోవడం సాధారణ విషయమే. అయితే ఎక్కువ మంది ఆడవాళ్లు మల్లెపూలను తలలో పెట్టుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది అందం కోసమే ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకుంటారని భావిస్తారు. కానీ ఆడవాళ్లు మల్లెపూలను ఇష్టపడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందని మాత్రం తెలియదు.
మల్లెపూలను పూలలోనే రాణిగా పిలుస్తుంటారు. అందుకే వీటిని దేవుడి పూలు అని కూడా అంటుంటారు. మల్లెపూలు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. అయితే ఎక్కువగా దేవుడికి అలంకరించే మల్లెపూలను ఆడవాళ్లు ఎందుకు తలలో పెట్టుకుంటారంటే.. వాటి వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువ రోజులు ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు చెప్పేవారట. అందుకే పూర్వం ఆడవాళ్లు ఎక్కువగా మల్లెపూలను తలలో పెట్టుకునేవారట.
మరోవైపు మల్లెపూలు మానసికంగానూ ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. వాటి వాసనకు మతి పోవడం ఖాయం. అందుకే ఫస్ట్ నైట్ రోజు ఎక్కువగా మల్లెపూలతో డెకరేషన్ చేస్తుంటారు. నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లు చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు మల్లెపూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలని.. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుందని హితవు పలుకుతున్నారు.
మరోవైపు మల్లెపూల వాసనతో మనసు స్థిమితంగా మారుతుందట. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుందట. మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపంతో బాధపడేవారిని శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందట. చూశారా మల్లెపూలతో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఈ కారణాల వల్లే మల్లెపూలు పెట్టుకున్న వాళ్లు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి.