Salt: ఉప్పును ఇతరులకు ఇస్తే అశుభం జరుగుతుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Salt: మనం ఇంట్లో తయారు చేసుకునే వంటకాలలో ఎక్కువ వంటకాలకు ఉప్పు ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. ఉప్పు లేకుండా వంటకాలు చేస్తే ఆ వంటకాలు ఏ మాత్రం రుచిగా ఉండవు. మార్కెట్ లో దొరికే చాలా వస్తువులతో పోల్చి చూస్తే ఉప్పు ఖరీదు కూడా తక్కువనే సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉప్పుతోనే వ్యాపారాలు చేస్తుండటం గమనార్హం. ఉప్పు లేకుండా కూరలు చేస్తే ఆ కూరలను ఎవరూ తినలేరనే సంగతి తెలిసిందే. అయితే పెద్దవాళ్లలో […]

Written By: Navya, Updated On : April 6, 2022 6:26 pm
Follow us on

Salt: మనం ఇంట్లో తయారు చేసుకునే వంటకాలలో ఎక్కువ వంటకాలకు ఉప్పు ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. ఉప్పు లేకుండా వంటకాలు చేస్తే ఆ వంటకాలు ఏ మాత్రం రుచిగా ఉండవు. మార్కెట్ లో దొరికే చాలా వస్తువులతో పోల్చి చూస్తే ఉప్పు ఖరీదు కూడా తక్కువనే సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉప్పుతోనే వ్యాపారాలు చేస్తుండటం గమనార్హం. ఉప్పు లేకుండా కూరలు చేస్తే ఆ కూరలను ఎవరూ తినలేరనే సంగతి తెలిసిందే.

అయితే పెద్దవాళ్లలో చాలామంది ఉప్పును చేతిలో ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని చెబుతుంటారు. ఇలా చెప్పడం వెనుక ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి. ఇతరులకు ఉప్పు ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. దశ దానాలలో ఉప్పు ఒకటి అని ఉప్పు అనేది అశుభం అని పెద్దలు చెబుతారు. అందువల్లే ఉప్పును దిష్టి తీయడానికి వినియోగిస్తారని పండితులు సైతం సూచిస్తున్నారు.

ప్రకృతి వనరు అయిన ఉప్పును కిరాణా షాపులలో కూడా ఇతరుల చేతి నుంచి తీసుకోకూడదు. ఉప్పును ఇతరులకు అందిస్తే ఒకరి రహస్యాలను మరొకరికి చెప్పడమేనని పెద్దలు భావిస్తారు. ఉప్పును ఇతరులకు దానం చేయాల్సి వచ్చినా చేతి నుంచి డైరెక్ట్ గా ఇవ్వడం మంచిది కాదు. నిత్య జీవితంలో మనం వాడే ఉప్పుకు సంబంధించి ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

మరోవైపు సాధారణ ఉప్పు మంచిదా అయోడిన్ తో ఉన్న ఉప్పు మంచిదా అనే చర్చ ఈ మధ్య కాలంలో జోరుగా జరుగుతోంది. అయితే అయోడిన్ లోపం ఉన్నవాళ్లు మాత్రం అయోడిన్ తో తయారు చేసిన ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు.