Sleeping While Traveling: నిద్రపోవడం ఒక యోగం.. అలా పడుకోగానే కొందరికి ఇలా నిద్ర పడుతుంది. నిద్రా దేవి ఎంత త్వరగా వస్తే వారు అంత అదృష్టవంతులు అంటారు. కానీ అందరికీ త్వరగా నిద్రరాదు.. ఈ పోటీ ప్రపంచంలో.. సెల్ ఫోన్ తో కాలక్షేపంలో మనిషికి నిద్ర దూరమైంది. చాలా కరువైంది. అర్థరాత్రి 1, 2, 3, 4 గంటల వరకూ నిద్రపట్టక బెడ్ పై దొర్లే వారు.. సెల్ ఫోన్ తో కాలక్షేపం చేసే వారే ఎక్కువ మంది.
అయితే ఎక్కడ పడుకున్నా కోకున్నా.. చాలా మందికి ప్రయాణాల్లో మాత్రం ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. కారు ప్రయాణాలు లేదా బస్సు, రైలు వంటి ప్రయాణాల్లో మనం ఇట్టే నిద్ర పోతాం.. చాలా మందికి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది.. ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానరు.
మనకు ఇంట్లో మెత్తటి పరుపు, దిండు ఉన్నా కూడా నిద్ర రాదు.. రాత్రంతా జాగరణ చేస్తాం. కానీ బస్సు, రైలు, కారు ఇతర ప్రయాణ సమయాల్లో రైలులో నిద్ర కమ్ముకొస్తుంది. తెలియకుండానే నిద్రలోకి జారిపోతుంటాం.. బస్సులో ఎంత శబ్ధం జరుగుతున్నా.. అదంతా మరిచిపోయి నిద్రలోకి ఒరిగిపోతాం.. దీనికి శాస్త్రీయ కారణాలున్నాయి.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!
ప్రయాణాలు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల నిద్ర వస్తుందంటారు. చల్లటి గాలి శరీరానికి తగలటం వల్ల నిద్ర పడుతుందంటారు. కానీ శాస్త్రీయ ఆధారాలను బట్టి చూస్తే దీనికి కారణం ‘రాకింగ్ సెన్షేషన్’ అని తేలింది. మన చిన్నప్పుడు ఊయలలో చిన్నపిల్లలను వేసి ఊపగానే పడుకుంటారు కదా.. అలానే ప్రయాణాల్లో కూడా మన శరీరం కొద్దిగా అటూ ఇటూ కదలడం మూలంగా నిద్ర పోతుంటామని నిపుణులు చెబుతున్నారు. తేలికగా ఇలా కదలడాన్ని ‘రాకింగ్ సెన్షేషన్’ అంటారు. ఇది మన మెదడుపై సమకాలీకరణ ప్రభావాన్నిచూపుతుందట.. ఫలితంగానే మన నిద్ర మోడ్ లోకి వెంటనే జారిపోతామట.. దీన్నే స్లో రాకింగ్ అంటారట.. ఈ కారణంగానే ప్రయాణాల్లో వెంటనే నిద్ర పడుతుందని శాస్త్రీయంగా తేలిందట..
Also Read: ఇంట్లో నల్లాలు లీక్ అయితే మనీ ప్రాబ్లమ్స్ తప్పవా?