https://oktelugu.com/

Birds: క‌రెంటు తీగ‌ల‌ పై కూర్చున్నా ప‌క్షుల‌కు ఎందుకు షాక్ కొట్ట‌దు ?

Birds: క‌రెంటు మానవ జీవితాన్ని మార్చేసింది. అయితే, అదే కరెంట్ కారణంగా జీవితాలను కోల్పయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు అనే వార్తలను ఎక్కువగా వినేవాళ్ళం. అసలు క‌రెంటు తీగ‌ల‌ను మనం ముట్టుకుంటే వెంటనే షాక్ కొడుతుంది. ఇక ఇళ్లకు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అందే విద్యుత్ అయితే ర‌క‌ర‌కాలుగా ఉంటుంది. చాలా వ‌ర‌కు ఇళ్లకు సింగిల్ ఫేజ్ కరెంటే ఎక్కవగా ఉంటుంది.   కానీ, అదే ప‌రిశ్ర‌మ‌ల‌ విషయానికి వస్తే.. […]

Written By:
  • Shiva
  • , Updated On : January 28, 2022 / 02:47 PM IST
    Follow us on

    Birds: క‌రెంటు మానవ జీవితాన్ని మార్చేసింది. అయితే, అదే కరెంట్ కారణంగా జీవితాలను కోల్పయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు అనే వార్తలను ఎక్కువగా వినేవాళ్ళం. అసలు క‌రెంటు తీగ‌ల‌ను మనం ముట్టుకుంటే వెంటనే షాక్ కొడుతుంది. ఇక ఇళ్లకు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అందే విద్యుత్ అయితే ర‌క‌ర‌కాలుగా ఉంటుంది. చాలా వ‌ర‌కు ఇళ్లకు సింగిల్ ఫేజ్ కరెంటే ఎక్కవగా ఉంటుంది.

    Birds

     

    కానీ, అదే ప‌రిశ్ర‌మ‌ల‌ విషయానికి వస్తే.. 3 ఫేజ్ క‌రెంట్ ఉంటుంది. పైగా ఇందుకు లైన్లు కూడా వేర్వేరుగా వేస్తారు. అయితే మనం ఏ లైన్‌ కు చెందిన క‌రెంటు తీగ‌ల‌ను ముట్టుకున్నా స‌రే.. వెంటనే షాక్ కొడుతుంది, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. కానీ ఎప్పుడైనా గమనించారా ? ప‌క్షులు క‌రెంటు తీగ‌ల‌ పై వాలితే మాత్రం వాటికి అస్సలు షాక్ కొట్ట‌దు. మనిషికి షాక్ ఇచ్చిన కరెంట్, మరి పక్షులకు ఎందుకు షాక్ ఇవ్వదు ?

    Also Read:  వెలుగులోకి మరో కొత్త వైరస్.. డేంజర్ బెల్స్..!

    Birds

    అసలు అలా ఎలా జరుగుతుంది ? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

    మొద‌టి కార‌ణం :

    గుర్తు పెట్టుకోండి.. విద్యుత్ తక్కువ నిరోధం ద్వారా ప్రయాణిస్తోంది. పక్షులు, జీవులన్నీ కొద్దో గొప్ప నిరోధం (Resistance) కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే మనిషి కన్నా పక్షికి ఎక్కువ నిరోధం ఉంటుంది. అందుకే, విద్యుత్ పక్షి గుండా ప్రవహించదు. బహుశా ఆ దేవుడే పక్షులకు ఈ శక్తిని ఇచ్చి ఉంటాడు. భవిష్యత్తులో మనిషి కరెంట్ ను కనిపెడతాడని, దాని వల్ల పక్షులకు ప్రమాదం అని దేవుడు.. పక్షులకు, జీవులకు గొప్ప నిరోధక శక్తిని ఇచ్చాడు.

    Birds

     

    2వ కార‌ణం విషయానికి వస్తే.. :

    విద్యుత్ ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోటు నుంచి తక్కువ పొటెన్షియల్ ఉన్న చోటికి ప్రవహిస్తూ ఉంటుంది. ప‌క్షి ఒకే వైరు మీద కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం దాదాపు శూన్యం గా ఉంటుంది. అందుకే, కరెంట్ పక్షి గుండా ప్రవహించదు.. కాబట్టి పక్షికి కరెంట్ షాక్ కొట్టదు. .

    అయితే, కొన్ని సార్లు ఒక వేళ పక్షి ఒక వైరు మీద కూర్చొని మ‌రో క‌రెంట్ వైర్ ను గానీ, భూమిని కానీ తాకితే మాత్రం అప్పుడు కరెంటు పక్షి గుండా ప్రవహించి భూమిలోకి కూడా పాస్ అవుతుంది. ఎప్పుడైతే స‌ర్క్యూట్ కంప్లీట్ అవుతుందో, అప్పుడు క‌రెంట్ పాస్ అవుతుంది. ఆ సమయాల్లో మాత్రం పక్షికి షాక్ కొడుతుంది.

    ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కరెంట్ తీగల్లో ఒకే తీగని గట్టిగా పట్టుకొని భూమి తగలకుండా వేళ్ళాడితే మనుషులకు కూడా కరెంట్ షాక్ కొట్టదు. ఏది ఏమైనా కరెంట్ వల్ల భూమి పై ఎన్నో అద్భుతాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. అసలు కరెంట్ లేని ప్రపంచాన్ని ఉహించుకోలేం కదా.

    Also Read: TTD Online Tickets: తిరుమలేషుడికి ఎంత డిమాండ్ స్వామి?

    Tags