White Hair Problem
White Hair Problem: ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం మామూలు విషయమే. కానీ చిన్న వయసులోనే జుట్టు నెరిస్తే ఎలా అని లోలోపల కుమిలిపోతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు ఎందుకు తెల్లబడుతుంది. మన పూర్వీకులకు ఎందుకు తెల్లబడలేదు. వారు ఎన్నేళ్లు వచ్చినా వారి జుట్టు మాత్రం అలాగే ఉండేది. వారి ఆహార అలవాట్లు బాగున్నాయి కాబట్టే వారికి తెల్ల జుట్టు రాలేదు. కానీ ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాల ప్రభావంతో జుట్టు ఇరవైలోనే తెల్లబడుతోంది. దీంతో ఇరవైలోనే అరవైలా మారిపోతున్నారు.
తెల్ల జుట్టును నల్లగా చేసుకోవాలని రకరకాల సౌందర్య సాధనాలు వాడుతున్నారు. అయినా ఫలితం లేదు. పుండు ఒక చోట ఉంటే మందు ఇంకో చోట పెడితే కుదురుతుందా? మొదట మనం తీసుకునే ఆహారాల్లో మార్పు చేసుకోవాలి. నేను ఏది పడితే అది తింటా నా జుట్టు నల్లగా ఉండాలంటే ఉంటుందా? దానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి. వాటిని పాటిస్తే ఫలితం ఉంటుంది.
వెంట్రుకలు నల్లగా ఉండాలంటే మెలనిన్ అనే పదార్థం ఉంటే నల్లగా ఉంటాయి. లేకపోతే తెల్లగా మారతాయి. దీంతో వెంట్రుకలు తెల్లబడకుండా చూసుకోవాలంటే మెలనిన్ తగ్గకుండా చూసుకోవాలి. అది తగ్గితే వెంట్రుకలు తెల్లబడటం సహజం. వయసు పైబడినా తెల్లగా అవుతాయి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా తెల్లగా కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈనేపథ్యంలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా రకాల ఉత్పత్తులు వాడుతున్నారు. దీంతో లాభం లేకపోయినా డబ్బులు మాత్రం పోగొట్టుకుంటున్నారు. ఇంట్లోనే తయారు చేసుకునే ఎన్నో పరిహారాలు ఉన్నా అనవసరంగా ఏవో వాడుతూ నష్టపోతున్నారు. తెల్ల జుట్టను నల్లగా చేసుకునేందుకు మనం ఎన్నో రెమెడీలు చెప్పుకున్నాం. వాటిని వాడుకుని బాగు చేసుకోండి.