stomach : గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోని వర్క్ చేయడం, మారిన జీవనశైలి వల్ల చాలామందికి ఈ మధ్య పొట్ట వస్తుంది. కనీసం వర్క్‌వుట్‌లు, వ్యాయామాలు కూడా చేయడం లేదు. దీంతో చాలామందికి పొట్ట ఎక్కువగా వస్తుంది. ఇందులో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. దీనిని తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్ చేయడం, మందుల వాడటం చేసిన పొట్ట తగ్గదు. ఒక్కసారి పొట్ట వస్తే తగ్గడం చాలా కష్టం. అసలు ఎన్ని చిట్కాలు పాటించిన పొట్ట పెరుగుతుంది. కానీ తగ్గదు. అయితే మహిళల కంటే పురుషులకే పొట్ట ఎందుకు తొందరగా పెరుగుతుంది? దీనికి గల కారణాలేంటో? తెలియాలంటే లేటు చేయకుండా ఈ స్టోరీ చదివేయండి.
పొట్ట పెరగడానికి ముఖ్య కారణం శారీరక శ్రమ లేకపోవడం. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత క్యాలరీలను కరిగించుకోవాలి. లేకపోత ఇలానే పొట్ట పెరుగుతుంది. శారీరకంగా కష్టపడే వాళ్లు చాలా ఫిట్‌గా ఉంటారు. కానీ కూర్చోని పని చేసేవాళ్లకే పొట్ట ఎక్కువగా పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే తిన్న ఆహారం కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. కనీస వ్యాయామం కూడా లేకపోవడం వల్ల పురుషులకు తొందరగా పొట్ట పెరుగుతుంది. మహిళలు అయితే కనీసం ఇంట్లో పని అయిన చేయడం వల్ల వ్యాయామం అవుతుంది. అలాగే ఆహారాన్ని కూడా సరైన సమయానికి తీసుకోవాలి. టైమ్‌తో సంబంధం లేకుండా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల పొట్ట తప్పకుండా పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి బయట ఫుడ్ తినడం కాస్త తగ్గించండి. వీటిలో మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు పెరిగి పొట్ట వస్తుంది.
ప్రస్తుతం చాలామంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. దీనివల్ల తిన్న వెంటనే కంప్యూటర్ ముందు కూర్చోవడం లేకపోతే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల పొట్ట తొందరగా వస్తుంది. చాలామంది రాత్రి తిన్న తర్వాత అలా బెడ్ ఎక్కి నిద్రపోతారు. కనీసం పది నిమిషాలు వాకింగ్ అయిన చేయరు. తిన్న తర్వాత కొంతసమయం వాకింగ్ చేస్తే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా ఉంటుంది. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వలన ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పొట్ట పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల పొట్టతో పాటు బరువు కూడా పెరుగుతారు. ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు ఉండేట్లు చూసుకోవాలి. ప్రస్తుతం వీటి కంటే చిప్స్, ఫ్రై వంటివే ఎక్కువగా తింటున్నారు. సమయం సందర్భం లేకుండా వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం చేయాలి. ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చోకూడదు. కనీసం అప్పుడప్పుడైనా బాడీకి శారీరక శ్రమ పెట్టాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Why do men get stomach cramps more than women do you know the reasons
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com