Homeహెల్త్‌WHO Report: ప్రపంచంలో అత్యధిక మరణాలు కారణమవుతున్న ఈ 10 వ్యాధులు.. కరోనా కంటే డేంజర్

WHO Report: ప్రపంచంలో అత్యధిక మరణాలు కారణమవుతున్న ఈ 10 వ్యాధులు.. కరోనా కంటే డేంజర్

WHO Report: ప్రస్తుతం చాలామంది ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. ప్రపంచంలోని ఏ ఇంటిని చూసుకున్నా సరే.. ఆ ఇంటిలో ఒక్కరైనా ఆసుపత్రి పాలై ఉంటారు. మారుతున్న జీవనశైలి లేకపోతే ఆరోగ్య అలవాట్ల కారణమో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వ్యాధులతో మనుషులు బలి అవుతున్నారు. ఇటీవల వచ్చిన కోవిడ్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సొంత వాళ్లను కూడా చివరిసారి చూసుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేవలం కరోనా వల్ల మాత్రమే కాకుండా వేరే వ్యాధులు వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది చనిపోతున్నారు. మరి ఆ వ్యాధులేంటో తెలుసుకుందామా.

ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ముఖ్య కారణం కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ అని డబ్ల్యూఎచ్‌ఓ తెలిపింది. అయితే మొత్తం పది వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా మరణాలకు కారణమయ్యాయి. అవిఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, కోవిడ్-19, స్ట్రోక్, క్రానిక్ అబ్ట్ర్సక్టివ్ పల్మనరీ డిసీజ్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, శ్వాసనాళం, బ్రోంకస్, ఊపిరితిత్తులు, క్యాన్సర్లు, అల్జీమర్స్ వ్యాధి, డయాబెటిస్ మెల్లిటస్, కిడ్నీ వ్యాధులు, క్షయ వ్యాధి వరుసగా కారణమయ్యాయని డబ్ల్యూఎచ్‌ఓ నివేదిక తెలిపింది.

రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల గుండె బలహీనపడుతుంది. సిరల్లో ఫలకం పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో వ్యక్తికి ఛాతీ నొప్పి, ఇస్కీమిక్ గుండె జబ్బు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. వచ్చిన కొద్ది సమయంలోనే కొందరు మరణిస్తారు. అందుకే దీనికి మొదటి స్థానం ఇచ్చారు. మారుతున్న జీవినశైలి వీటికి ప్రధాన కారణం. ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే రోజూ ఒక 10 నుంచి `15 నిమిషాలు వ్యాయామం చేస్తే వీటి నుంచి బయటపడవచ్చు. కరోనా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు, నాలుగు స్థానాల్లో స్ట్రోక్, క్రానిక్ అబ్ట్ర్సక్టివ్ పల్మనరీ డిసీజ్‌ ఉన్నాయి. మొత్తం మరణాల్లో ఇవి 10 శాతం, 5 శాతం ఇవి ఉన్నాయి.

ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటు వ్యాధిలో దిగువ శ్వాసకోశ సంక్రమణ వ్యాధి ఒకటి. ప్రపంచ మరణాల్లో అయిదవ స్థానంలో ఈ వ్యాధి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వీటి కారణంగా మరణాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. దీని తర్వాత స్థానాల్లో శ్వాసనాళం, బ్రోంకస్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఎక్కువగా మరణిస్తున్నారు. అలాగే అల్జీమర్స్, మధుమేహం, అతిసార వ్యాధులు, కిడ్నీ డిసీజ్‌ల వల్ల చాలామంది మరణిస్తారు. డబ్ల్యూఎచ్‌ఓ ప్రకారం మధుమేహంతో మరణించేవాళ్ల సంఖ్య ఈమధ్య కాలంలో పెరుగుతుంది. ఈ వ్యాధి వల్ల మహిళలు కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో టీబీ, ఎయిడ్స్ వల్ల ఎక్కువగా చనిపోయారు. వీటికి సరికొత్త చికిత్సలు రావడంతో వీటి మరణాల సంఖ్య ప్రస్తుతం తగ్గుతుంది. కానీ వైరల్ ఫివర్స్ వస్తే మలేరియా కారణంగా చనిపోయిన వారి సంఖ్య తగ్గింది కానీ డెంగ్యూ వల్ల ఎక్కువమంది చనిపోతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular