Married Life : కొందరు వైవాహిక జీవితంతో పాటు సంసార జీవితంలో సంతోషంగా ఉంటారు. కానీ కొంతమంది వైవాహిక జీవితంలో మాత్రమే సంతోషంగా ఉంటారు. సంసార జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించలేరు. పెళ్లి అయి పదేళ్లు అయ్యిందనుకుంటే పోనీ సంసార జీవితాన్ని ఆస్వాదించకపోతే అనుకోవచ్చు.కానీ కొత్తగా పెళ్లయిన సంసార జీవితంలో సంతోషంగా లేకపోయిన, సంసార జీవితాన్ని ఆస్వాదించలేకపోతే వాళ్లకు ఈ సమస్య ఉన్నట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహిళలు లేదా పురుషులు శృంగారంలో తృప్తి చెందకపోతే వాళ్లకు అనార్గాస్మియా సమస్య ఉన్నట్లే అని వైద్యనిపుణులు అంటున్నారు. దీనిని ఆర్గాస్మిక్ డిస్‌ఫంక్షన్ అని కూడా అంటారు. ఈ సమస్య మగ, ఆడ ఇద్దరిలో కనిపిస్తుంది. కానీ ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. అనార్గాస్మియా సమస్య ఉన్నవాళ్లు శృంగారంలో ఎంతసేపు పాల్గొన్న తృప్తి చెందరు. నిజం చెప్పాలంటే వాళ్లకు శృంగారం మీద అంత ఆసక్తి కూడా ఉండదు. అయితే ఈ సమస్య ఉన్నట్లు వాళ్లకి తెలియదు. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు కొంచం డిఫరెంట్‌గా ప్రవర్తిస్తారు. కారణం లేని కోపం, ఒత్తిడి, ఆందోళన, చిన్న విషయాలకు చిరాకు పడటం, డిప్రెషన్ వంటివన్నీ వాళ్లలో కనిపిస్తాయి. చాలామంది ఈ సమస్యను గుర్తించలేరు. ఒకవేళ గుర్తించిన ఎవరికీ చెప్పుకోలేరు. చివరికి డాక్టర్‌కి కూడా చెప్పుకోలేరు. ఇలా చేయడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఈ లక్షణలు కనిపించిన, సమస్యను గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
అనార్గాస్మియాలో ఉండే రకాలు
ఏ మాత్రం డిఫరెంట్ అనిపించినా, లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్లు అల్ట్రాసౌండ్, రక్త, మూత్ర పరీక్షలతో ఈ అనార్గాస్మియాను గుర్తిసారు. అయితే ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. ఈ రకాలను బట్టి చికిత్స ఉంటుంది.
*జీవితకాల అనార్గాస్మియా
ఈ రకం అనార్గాస్మియాలో వాళ్లు ఎప్పుడు శృంగారంలో పాల్గొన్న తృప్తి చెందరు. ఒక్క మాటలో చెప్పాలంటే శృంగారంలో పాల్గొన్న వాళ్లు తృప్తి చెందరు.
*అక్వయిర్డ్ అనార్గాస్మియా
ఇంతకు ముందు శృంగారంలో పాల్గొన్నప్పుడు సంతృప్తి కలిగేది. కానీ వ్యక్తిగత కారణాలు లేదా డిప్రెషన్ వల్ల ప్రస్తుతం వాటిపై ఇంట్రెస్ట్ లేకపోవడం.
*సిట్యూయేషనల్ అనార్గాస్మియా
ఈరకమైన అనార్గాస్మియా సమస్య ఉన్నవాళ్లు ఇష్టపడిన వ్యక్తులతో మాత్రమే శృంగారంలో పాల్గొన్నప్పుడు సంతృప్తి చేందుతారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్లు ఏదో కుటుంబం కోసం మాత్రమే వాళ్లతో ఉంటారు.
*జనరలైజ్జ్ అనార్గాస్మియా
సాధారణంగా ఇష్టమైన వ్యక్తులతో మాత్రమే శృంగారం చేస్తారు. కానీ ఈ రకమైన సమస్య ఉన్నవాళ్లు ఎవరితోనైనా శృంగారం చేయగలరు. ఎప్పుడైనా ఎవరితోనైనా సంతృప్తి చెందగలరు.
అనార్గాస్మియా సమస్య రావడానికి ముఖ్య కారణం గతంలో జరిగిన విషయాలే అని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్, ఆందోళన, లేకపోతే గతంలో జరిగిన లైంగిక వేధింపులు లేదా లైంగిక దాడి అని వైద్యులు అంటున్నారు. అలాగే భాగస్వామి మీద నమ్మకం లేకపోవడం కూడా ఓ కారణమే. అయితే ఈ సమస్యను కౌన్సిలింగ్ ద్వారా తొందరగా నయం చేయవచ్చు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More