https://oktelugu.com/

Weight Loss Tips: వేసవిలో సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!

Weight Loss Tips: మనలో చాలామంది అధిక బరువు వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో ఫెయిల్ అవుతుంటారు. అయితే వేసవిలో బరువు తగ్గాలని భావించే వాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో బరువు తగ్గాలని భావించే వాళ్లు మొదట ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎలాంటి ఆహారాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 1, 2022 / 03:19 PM IST
    Follow us on

    Weight Loss Tips: మనలో చాలామంది అధిక బరువు వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో ఫెయిల్ అవుతుంటారు. అయితే వేసవిలో బరువు తగ్గాలని భావించే వాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో బరువు తగ్గాలని భావించే వాళ్లు మొదట ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

    Weight Loss Tips

    ఎలాంటి ఆహారాలను తీసుకుంటే బరువు పెరుగుతామో గుర్తించి ఆ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వ్యాయామాలు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. జాగింగ్, స్విమ్మింగ్, బరువులు ఎత్తడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. వేసవిలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రో బయోటిక్స్ చేకూరేలా చేసి సులభంగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Also Read: Roja Amabati: ఫైర్ బ్రాండ్స్ రోజా, అంబటికి జగన్ ఎందుకు మంత్రి పదవులు ఇవ్వడం లేదు?

    సాధారణగా కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేసవికాలంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీర బరువును సులభంగా అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఫిట్ నెస్ వ్యాయామాలు చేయడం ద్వారా కుడా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. నీళ్లు ఎక్కువగా తీసుకుని శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం ద్వారా కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

    ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడం సులువు అని చెప్పవచ్చు. బరువు అదుపులో ఉంటే మాత్రమే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. వేసవిలో బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

    Also Read: Ashoka Vanam lo Arjuna Kalyanam: అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం.. పాట వచ్చేసింది