Irregular Periods Problem: ప్రస్తుతం చాలా మందికి నెలసరి సమస్యలు వస్తున్నాయి. పీరియడ్ సరైన సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా నెలసరి సక్రమంగా వచ్చే వారికి 21 రోజుల నుంచి 40 రోజుల మధ్య వస్తుంది. 5 నుంచి 7 రోజులు రక్తస్రావం అవుతుంది. నెలసరి సక్రమంగా రాకపోతే సమస్యలు పెరుగుతాయి. మనం తీసుకునే ఆహారం సక్రమంగా లేకపోతే నెలసరి ఇబ్బందులు కలుగుతాయి. పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
సంతాన లేమి
నెలసరి సక్రమంగా రాకపోతే సంతానం కలిగే అవకాశాలు కూడా తక్కువే. ఇలాంటి వారు పండ్లు, కూరగాయలు తింటే ఫలితం ఉంటుంది. అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. దీంతో పీసీవోడీ సమస్య వేధిస్తుంది. ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఎక్కువగా మంచినీళ్ల తాగాలి.
సరైన నిద్ర
నెలసరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి నెల బహిష్టు సరైన సమయానికి రావడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. ఇలా పీరియడ్ సరిగా రాకపోతే నష్టమే. కొందరికైతే రెండు మూడు నెలలకోసారి రావడం జరుగుతుంది.
చిట్కా
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో ఒక టమాట నుంచి తీసిన రసాన్ని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు పడుకునే ముందు తాగాలి. ఇలా తాగుతూ కొద్ది బెల్లం తినాలి. దీని వల్ల బహిష్టు క్రమం తప్పకుండా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.