What is the right age for dating: ఒకప్పటి రోజుల్లో డేటింగ్ అంటే ఏంటో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుల్లో స్కూల్ చదువుకునే పిల్లలకు కూడా డేటింగ్ అంటే తెలుసు. చాలామంది ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకునే ముందు డేటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి వరకు వెళ్తున్నారు. కొందరు పెళ్లి చేసుకోవాలని డేటింగ్ చేస్తే, మరికొందరు టైమ్‌పాస్‌కి డేటింగ్ చేస్తారు. అయితే కొందరికి అయితే డేటింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియకుండా డేటింగ్ చేస్తున్నారు. తెలిసి తెలియని వయస్సులో డేటింగ్ చేసి వాళ్ల జీవితాన్ని పూర్తిగ నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్నతనంలో డేటింగ్ చేయడం వల్ల కెరీర్ నాశనం చేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అయితే డేటింగ్ చేయడానికి అసలు సరైన వయస్సు ఏది? వయస్సుకి డేటింగ్‌కి సంబంధం ఉందా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం.
పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని కొందరు డేటింగ్‌లో ఉంటారు. సాధారణంగా యుక్త వయస్సు వచ్చిన తర్వాత చాలా మంది డేటింగ్‌లోకి వెళ్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం డేటింగ్ అనేది 18 నుంచి 25 ఏళ్లలో చేయడం మంచిదని నమ్ముతారు. ఎందుకంటే ఈ వయస్సులో కాస్త మెచ్యూరిటీ ఉంటుంది. ఏదైనా ఆలోచించే శక్తి కూడా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు తప్పా? ఒప్పా? అని తెలిస్తుంది. అదే చిన్న వయస్సులో డేటింగ్ చేస్తే.. ఏ విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేరు. అంతగా ఆలోచించే సామర్థ్యం కూడా ఉండదు. డేటింగ్ చేసే వ్యక్తి ఎలా ఉంటారు? ఏం తెలియకుండా ఎంటర్ అవుతారు. దీనివల్ల రిలేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. చిన్నతనంలో పెద్దగా తెలియకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ వయస్సులో స్నేహితులు, చుట్టూ ఉన్నవారు చెప్పిందే వింటారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.
ఒక వయస్సు వచ్చిన తర్వాత డేటింగ్ చేయడం వల్ల కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. చిన్న వయస్సులో నిజమైన ప్రేమ ఏదో కూడా సరిగ్గా తెలియదు. అదే ఒక వయస్సు వచ్చిన తర్వాత డేటింగ్ చేయడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ పెరుగుతుంది. చిన్నతనంలో ప్రేమ లేదా అట్రాక్షన్ అని తెలుసుకోలేరు. అదే వయస్సు వచ్చిన తర్వాత డేటింగ్ చేస్తే అన్ని విషయాలను ఆలోచించి రిలేషన్‌లోకి వెళ్తారు. కెరీర్, కుటుంబం, బాధ్యత, ఆర్థిక సమస్యలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని రిలేషన్‌లోకి వెళ్తారు. ఈ వయస్సులో డేటింగ్ చేసిన వారు తప్పకుండా పెళ్లి వరకు వెళ్తారు. కానీ చిన్న వయస్సులో డేటింగ్ చేస్తే గొడవలను, వ్యక్తులను అర్థం చేసుకోలేక విడిపోవాల్సి వస్తుంది. అయితే డేటింగ్‌కి వయస్సుకు సంబంధం లేదని కొందరు అంటున్నారు. ఇద్దరి ఆలోచనలు, అర్థం చేసుకునే వ్యక్తిత్వం, వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాన్ని గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.