Tall : అందరిలో పొట్టిగా ఉండకుండా కాస్త పొడవుగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. పొడవు కావడానికి ఎన్నో ఎక్సర్సైజులు చేస్తుంటారు. కానీ కొందరు పొడవు పెరగరు. అయితే పొట్టిగా ఉన్న వాళ్ల కంటే పొడవుగా ఉన్న వాళ్లకే ఎక్కువగా వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎత్తుగా ఉండే వాళ్లకు వంద కంటే ఎక్కువగా వ్యాధులు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపుగా రెండు లక్షల మందిపై పరిశోధన జరిపి తెలిపారు. 5.9 అడుగుల ఎత్తు అంత కంటే ఎక్కువగా ఉన్నవాళ్లలో వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని.. అధ్యయనంలో తేలింది. ఈరోజుల్లో చాలా మంది యువత అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్న కొంతమందికి సమస్యలు తప్పడం లేదు. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్ గా ఉండాలని చాలా మంది జిమ్ వంటివి కూడా చేస్తున్నారు. అయిన ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆసుపత్రికి వెళ్లకుండా, మందులు వాడని వాళ్లు ఈరోజుల్లో లేరని అనలేం. అందరు కూడా ఏదో ఒక సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే మరీ ఎక్కువగా ఎత్తు ఉన్న వాళ్లకి వచ్చే వ్యాధులు ఏంటి? నిజంగానే ఎత్తుగా ఉంటే వ్యాధులు తప్పవా? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
గుండె జబ్బులు
ఎత్తు ఎక్కువగా ఉన్నవాళ్లకి గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనంలో తేలింది. ఎక్కువగా ఎత్తు ఉన్నవాళ్లకి రక్త పోటు ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి గుండె జబ్బులు వస్తాయని అధ్యయనంలో తేలింది.
క్యాన్సర్
పొట్టిగా ఉన్న వారి కంటే పొడవుగా ఉన్న వారిలో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పొడవుగా ఉన్న వారికి 16 శాతం క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది.
నరాలు దెబ్బతినడం
పొడవుగా ఉన్నవారికి తొందరగా నరాలు దెబ్బతింటాయి. ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ రావడంతో పాటు దాని సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు తెలిపాయి. కొందరికి కడుపులో పుండ్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఆస్తమా
సాధారణ ఎత్తుకంటే.. ఎక్కువ ఎత్తు ఉన్న వాళ్లకి ఆస్తమాకూడా వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు నాన్-స్పెసిఫిక్ నాడీ డిజార్డర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. అయితే ఇది అందరి పురుషుల్లో ఉండదు. ఎక్కువగా మహిళల్లో ఉంటుంది.
వందకి పైగా వ్యాధులు
పొడవు ఎక్కువగా ఉన్నవారిలో వందకి పైగా వ్యాధులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. చాలా మంది యువత అనారోగ్యానికి కారణం అవుతున్నారు. దీనికి కారణం ఎత్తు కూడా ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే పొడవుగా ఉన్నవాళ్లు ఆహారంలో మార్పులు చేయాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నీళ్లు తాగుతూ.. ఒత్తిడి లేకుండా నిద్రపోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం వంటి వాటిని కూడా దూరంగా ఉండాలి. అపుడే వచ్చే అనేక రకమైన వ్యాధులను నయం చేయవచ్చు.
Web Title: Being tall is also dangerous these diseases are inevitable for them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com