Milk Tea: చాయ్ చటుక్కున తాగరా భాయ్ అన్నారో సినీకవి. పొద్దున లేవగానే చాయ్ తాగనిదే దినచర్య ప్రారంభం కాని వాళ్లు చాలా మంది ఉంటారు. అంతలా చాయ్ కు బానిసలం అయ్యాం. అత్యంత చౌకగా దొరికే చాయ్ అంటే అందరికి ఇష్టమే. ప్రతి ఇంట్లో పొద్దున్నే చాయ్ తాగాకే ఇతర పనులు చేయడానికి వెళ్తుంటారు. ఎవరైనా పొద్దున్నే చాయ్ తాగావా అంటారు కానీ టిఫిన్ చేశావా అని మాత్రం అడగరు. దీంతో చాయ్ కు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. చాయ్ లో కేవలం ఒక శాతం కూడా ప్రొటీన్లు లేవని కొందరు చెబుతున్నా దాని గురించి ఇప్పుడు చెప్పలేం.
18వ శతాబ్దంలో టీని కుండలలో తయారు చేసేవారు. అప్పట్లో చైనీస్ కప్పులు వాడేవారు. దీంతో కప్పుల్లో వేడి చాయ్ పోస్తే అవి పగిలేవి. దీంతో కప్పులు పగలకుండా ఉండేందుకు ఓ ఉపాయం కనిపెట్టారు. కప్పులో ముందు పాలు పోస్తారు. తరువాత టీ పోసి కలిపితే పాలు టీ ఉష్ణోగ్రతను తగ్గించి కప్పు పగిలిపోకుండా చేసేది. దీంతో అందరు ఈ విధానాన్ని పాటించేవారు.
Also Read: మోదీ ఖాతాల్లో జమ చేస్తే.. జగన్ ప్రచారం చేసుకుంటున్నారా?
ఈ నేపథ్యంలో టీ ఓ వ్యసనంగా మారిపోయింది. ఖరీదైన పానీయంగా కూడా టీని ఆదరిస్తున్నారు. దీంతో టీ తాగని వారు లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతలా మనతో బంధం వేసుకున్న టీ తయారీలో ప్రస్తుతం కొత్త పద్ధతులు వచ్చినా పూర్వం రోజుల్లో మాత్రం పాలలో చాయ్ కలిపి తాగడం మాత్రం రివాజుగా ఉండేది. పాత సినిమాల్లో కూడా మనకు ఈ సన్నివేశాలు కనిపించడం తెలిసిందే.
ప్రపంచంలో అత్యధిక మంది కూడా టీతో సంబంధం ఉన్న వారే ఉన్నారు. పేదవారైనా ధనికులైనా టీ తాగనిదే ఉండరని తెలుస్తోంది. దీంతో తేనీరుగా పిలిచే టీ కి కనెక్ట్ కాని వారు లేరని తెలుస్తోంది. టీ టేస్ట్ చేయనిదే ఎవరికి కూడా మనసు కుదురుగా ఉండదని పలు సర్వేలు సూచిస్తున్నాయి. అంటే టీకి మనం ఎంతో అనుబంధం కలిగి ఉన్నామని చెబుతున్నారు.