Eggs Benefits: వైద్యులు ప్రతిరోజూ గుడ్డు తినాలని గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతుంటారు. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన పోషకాలను గుడ్డు ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎదిగే పిల్లలు గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. గుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పెద్దవాళ్లు రోజుకు ఒక గుడ్డును తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తోంది. పిల్లలు, గర్భిణులు ప్రతిరోజూ గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న పిల్లలకు 8 నెలల వయస్సు నుంచి గుడ్డు పెట్టవచ్చు. చాలామంది ఫారం కోడిగుడ్ల కంటే నాటుకోడి గుడ్లు మంచివని భావిస్తుంటారు. వాస్తవం ఏమిటంటే నాటుకోడి గుడ్డు అయినా ఫారం కోడిగుడ్డు అయినా పోషకాలు ఒకే విధంగా ఉంటాయి.
ఫారం కోడి గుడ్డుతో పోల్చి చూస్తే నాటుకోడి గుడ్డు వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత తక్కువగా అందుతాయి. ఫారం కోడిగుడ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి కూడా సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది శరీరానికి బలం చేకూరుతుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అయితే ఇలా తాగడం ఆరోగ్యానికి మేలు చేయదని గుర్తుంచుకోవాలి.
గుడ్డు తింటే వేడి చేస్తుందని వైరల్ అవుతున్న వార్తల్లో కూడా నిజం లేదు. బరువు తగ్గాలని భావించే వాళ్లకు గుడ్డు ఎంతో బెస్ట్ అని చెప్పవచ్చు. గుడ్డు ద్వారా శరీరానికి 7 గ్రాముల ప్రోటీన్ దక్కుతోంది. ఒక గుడ్డులో 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు మాత్రం గుడ్డులోని పచ్చసొన తీసేసి తింటే మంచిది.