Kangaroo Mother Care: సాధారణంగా కొందరు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా జన్మిస్తారు. ఇలాంటి పిల్లలను ఇంక్యూబేటర్‌లో పెడతారు. అయితే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో పిల్లలు ఇలా తక్కువ బరువుతో పుడితే.. సహజ పద్ధతులను పాటించేవారు. ముఖ్యంగా పిల్లలకు కంగారు కేర్ పాటించేవాళ్లు. పసిపిల్లలకు కంగారు మదర్ కేర్ చేయడం వల్ల తల్లి, బిడ్డ మధ్య బంధం బలపడటంతో పాటు ఇద్దరికీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతి ప్రస్తుతం ఇండియాలో ఫాలో అవుతున్నారు. కానీ విదేశాల్లో ఈ పద్ధతి ఎప్పటినుంచో ఉంది. మరి ఈ కంగారు మదర్ కేర్ అంటే ఏమిటి? ఈ పద్ధతిని ఎలా పాటించాలి? దీని ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
తల్లి ఛాతీకి హత్తుకునేలా పసిబిడ్డను పెడతారు. దీనినే కంగారు మదర్ కేర్ అంటారు. ఇది పద్ధతిని మొదటిగా కొలంబియా ఆసుపత్రిలో ఉపయోగించారు. ఈ పద్ధతి వల్ల శిశు మరణాల రేటు తగ్గిందట. ఇక అప్పటి నుంచి పద్ధతిని ఉపయోగిస్తారు. తల్లి ఛాతీ మీద శిశువుకు బట్టలు లేకుండా ఉంచాలి. ఇద్దరి తల్లి చర్మం బిడ్డ బాడీకి తగలాలి. అయితే బిడ్డను తల్లి రెండు రొమ్ముల మధ్య పడుకోపెట్టాలి. కంగారు మదర్ కేర్ చేసే ముందు తల్లి చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు ఇలా మదర్ కేర్ చేయడం వల్ల తల్లి బిడ్డకు ప్రయోజనాలు ఉంటాయి. కేవలం మదర్ మాత్రమే కాకుండా ఫాదర్ కూడా ఇలా చేయవచ్చు. అప్పుడు తండ్రికి బిడ్డకు మధ్య బంధం బలపడుతుంది.
కొంతమంది పిల్లలు నెలలు నిండకుండా పుట్టడం వల్ల వాళ్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీనివల్ల చిన్నారుల జీవక్రియ దెబ్బతింటుంది. ఇది సక్రమంగా పని చేయడానికి పిల్లలకు కంగారు మదర్ కేర్ చేస్తే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అలాగే పసిపిల్లల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఈ పద్ధతి బాగా తోడ్పడుతుంది. ఈ కంగారు మదర్ కేర్ వల్ల పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. కొంతమంది పిల్లలు అసలు పాలు తాగరు. అలాంటప్పుడు ఇలా ఛాతీ మీద పెడితే పాలు తాగడం వాళ్లకు అలవాటు అవుతుంది.
ఈ కంగారు మదర్ కేర్ పద్ధతిని పాటిస్తే 48 గంటల్లో పిల్లల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పిల్లల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొందరు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు కంగారు మదర్ కేర్ చాలా మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల చనుబాలు కూడా ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ కంగారు మదర్ కేర్‌ను రోజుకి రెండుసార్లు చేయాలని వైద్య నిపుణులు అంటున్నారు. గంట లేదా రెండు గంటల పాటు ఇలా చేస్తే తల్లిబిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుంది.