Sleep Late At Night: ఉద్యోగం, వ్యాపారం కారణంగా కొందరు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతే.. మరికొందరు మొబైల్ చూస్తూ.. స్నేహితులతో గడుపుతూ రాత్రంతా మెలకువతో ఉంటున్నారు. ఇలా మెలకువతో ఉండి ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇలాంటి వారి శరీరంలో అనేకమార్లు జరిగే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిద్ర ఆలస్యం అయితే గుండెకు చాలావరకు ముప్పు ఉందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్ తాజాగా హెచ్చరించింది. రాత్రి ఏ కారణం చేతనైనా ఆలస్యంగా నిద్రపోతే బాడీలో ఉండే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఈ అసోసియేషన్ పరిశోధకులు వెల్లడించారు. దీని పూర్తి వివరాల్లోకి వెళితే..
జనరల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా నిద్ర – మెలకువ అనే అంశాలపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ రెండిటిని బాడీ క్లాక్ నియంత్రిస్తుంది. ఇది దెబ్బతింటే శరీరంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిద్ర కడియారం దెబ్బ తింటే హార్ట్ ఎటాక్, స్టాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు తెలిపారు. మన శరీరంలో ప్రతి అవయం ఒక నిర్దిష్ట సమయానికి పనిచేయాలని అనుకుంటుంది. కానీ నిద్రపోయే సమయాన్ని మార్చడం లేదా రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోకుండా ఉండడం వల్ల నిద్ర గడియారం దెబ్బతింటుంది. దీంతో హార్మోన్ల సమత లేదా దెబ్బతిని.. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ గుండెపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలిపారు..
అయితే ఆలస్యంగా నిద్రపోయే వారిలోనే ఈ సమస్య ఎందుకు ఉందని కొందరికి సందేహం రావచ్చు. సాధారణంగా సరైన నిద్ర గంటలు పూర్తిగా ఉండవు. నిద్ర నాణ్యత తగ్గడం వల్ల శరీరానికి కావాల్సిన విశ్రాంతి దొరకదు. దీంతోపాటు వీరిలో వ్యాయామం చేసే అలవాటు తక్కువగా ఉంటుంది. అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, ఎక్కువగా మొబైల్ చూడడం వంటివి గుండె జబ్బులను తీసుకొచ్చి ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య ఎదుర్కొనే వారిలో స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలను కఠినంగా చేసి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఈ రకంగా కూడా హార్ట్ ఎటాక్, స్టాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని.. ఒకే సమయానికి నిద్రలేచి అలవాటును చేసుకోవాలి. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నాణ్యమైన నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. స్మోకింగ్, అధిక కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇలాంటి చిన్న అలవాటలు దూరం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.