https://oktelugu.com/

Hunger Reduce: ఆకలి తగ్గాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి

క్యారెట్లు ఎంతో బలవర్ధకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా కావడానికి దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్లు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలా వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అతి ఆకలిని దూరం చేస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2023 / 09:28 AM IST

    Hunger Reduce

    Follow us on

    Hunger Reduce: మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. దీంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సందే. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఆహారాలు తీసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఆకలి ఎక్కువగా ఉండకుండా చేసే ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

    చిలగడదుంపలు

    చిలగడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతాయి. మనకు త్వరగా ఆకలి వేస్తే ఎక్కువగా తినకుండా చేసే వాటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవాలని అనిపించదు.

    క్యారెట్లు

    క్యారెట్లు ఎంతో బలవర్ధకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా కావడానికి దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్లు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలా వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అతి ఆకలిని దూరం చేస్తాయి.

    స్ర్టాబెర్రీలు

    స్ట్రాబెర్రీలు కూడా మంచి ఆహారమే. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా అందుతాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. ఆరోగ్య పరిరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

    ఓట్స్

    బరువు తగ్గడానికి ఓట్స్ ఎంతో సాయపడతాయి. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మేలు కలుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఆహారం కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి దోహదపడతాయి. ఆకలిని తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.