ఒలింపిక్ విలేజ్‌లో దాదాపుగా 500 కంటే ఎక్కువ పదార్థాలు ఉంటాయి. వీటిలో ఫ్రెంచ్, ఆసియన్, ఆఫ్రికయన్ కరీబియన్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రధాన అందుబాటులో ఉంటాయి. 1896లో మొదటిసారి ఒలింపిక్స్‌లో గుడ్లు, బ్రెడ్, చీజ్, మాంసం, రెడ్ వైన్ పెట్టారట. ఆ తర్వాత నుంచి ఎక్కువగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్స్‌పై దృష్టిపెట్టారు. అలా ప్రతిసారి ఫుడ్ మెనూలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ప్లేయర్స్‌ను బట్టి ఫుడ్ మెనూ మారుస్తారు. ఎందుకంటే ఒక్కో ప్లేయర్ ఒక్కో రకమైన డైట్ ఫాలో అవుతుంటారు. అథ్లెట్స్ తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోతే ఆటలో అంతగా రాణించలేరు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన శ్రమ అంతా ఒక్కసారిగా వృథా అవుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
జపాన్, కొరియన్ 1980లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఆ సమయంలో వాళ్ల వంటకాలను ప్రపంచానికి తెలియజేయడానికి జపాన్ రైస్ బాల్, కొరియన్ కిమిచి వంటకాలు పెట్టారు. అయితే సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత కిమిచి ఫేమస్ కాగా, టోక్యో ఒలింపిక్స్ తర్వాత రైస్ బాల్ బాగా ఫేమస్ అయ్యాయి. ఈ ఫుడ్ మెనూలో ఆసియా వంటకాలు కూడా ఉంటాయి. బాస్మతి రైస్‌తో అన్నం, ఆలూ గోబీ, కాల్చిన కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుదీనా చట్నీ, పప్పు, వెజిటబుల్ బిర్యానీ, లాంబ్ కోర్మా, గుడ్లు, చిలకడదుంప, చికెన్ కర్రీలు కూడా ఉంటాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రిలయన్స్ గ్రూప్ ఇండియా హౌస్‌ను ప్రారంభించింది. మన అథ్లెట్స్ ఇండియన్ వంటకాలను మిస్ కాకుండా ఉండటానికి రిలయన్స్ ఇండియా హౌస్‌ను స్టార్ట్ చేసింది.